జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈసారి ఆన్ లైన్లో నామినేషన్ ఫారంలు ఫిలప్ చేసుకోవచ్చుని తెలిపింది. కానీ ప్రింటవుట్ తీసుకుని ఆర్వోకు ఫిజికల్ గా అందించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి…
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనుండగా, మే 13 (సోమవారం), మే 20 (సోమవారం), మే 25 (శనివారం), జూన్ 1 (శనివారం) తేదీల్లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు ప్రకటించింది.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్రంలో ఉన్న బీజేపీనే కవిత అరెస్ట్కు కారణం అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కవిత అరెస్ట్ పై రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ స్పందించారు. మద్యం కుంభకోణంలో కవితను అరెస్ట్ చేశారని, గత సంవత్సర కాలంగా దర్యాప్తు సంస్థలు అనేక ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కూడా సగం మంది…
లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటనకు కొన్ని రోజుల ముందు ఎన్నికల సంఘం నుంచి వైదొలగాలని మాజీ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు.. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. సామాజిక…
ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. పోలింగే మిగిలిందని తెలిపారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే.. 5 ఏళ్లుగా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని అన్నారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు…
భారతదేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమంగా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతోంది. పోలింగ్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు విఫలమైంది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శనివారం ప్రకటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు పూర్తిగా విఫలం కావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు భగ్నం చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసిందని విమర్శించారు అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కూడా అందులో భాగమేనని తెలిపారు.బీజేపీ కుట్రలకు బయపడి తాను…
రాజోలు జనసేన అభ్యర్థిత్వంపై వివాదం ముదురుతుంది. ఈ క్రమంలో.. బొంతు రాజేశ్వరరావు వర్గం రోడ్డెక్కింది. జనసేన అభ్యర్థిత్వంపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. బొంతు, దేవా వర్గాలు సీటు తమదంటే తమదంటూ పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నారు. మలికిపురంలో బొంతు రాజేశ్వరరావు ఇంటి నుంచి ఆయన వర్గం మలికిపురం వెంకటేశ్వర స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు.