ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ కానున్నట్లు.. ఆరోజు నుండి నామినేషన్లు స్వీకరించబడుతాయని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, 13 మే లోక్ సభ ఎన్నికలకు పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లోకి వచ్చిందని ఆయన తెలిపారు. 45,70,138 ఓటర్లు ఉన్నారని, నామినేషన్ చివరి తేదీ వరకు కూడా ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓటింగ్…
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు చంద్రబాబు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి.. సైకో పాలన పోవాలి ఎన్డీఏ పాలన రావాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని…
కాన్హాశాంతి వనంలో ‘గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్’ (ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం)లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. అతిథిదేవోభవ స్ఫూర్తి.. భారతదేశ జీవన విధానమన్నారు. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లో ఇవాళ ఇక్కడ పాల్గొంటున్న మీ అందరికీ సుస్వాగతమని, ఇన్నర్ పీస్ టు వరల్డ్ పీస్ ‑ మనశ్శాంతి నుంచి ప్రపంచశాంతి దిశగా మనం ప్రయాణించాల్సిన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. 132 ఏళ్ల క్రితం.. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ…
Pakistan: పాకిస్తాన్లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర వజీరిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది. గిరిజన జిల్లాలోని సెక్యురిటీ చెక్పోస్టుపై శనివారం ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాదికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ఏడుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మృతుల్లో్ ఉన్నారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు.
తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థి శశి థరూర్ గత 15 సంవత్సరాలుగా నియోజక వర్గానికి ఎంపీగా చేసిన సేవలను వివరిస్తూ 68 పేజీల బుక్లెట్ను శనివారం విడుదల చేశారు.
ఇసుక పాలెంలో ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ-జనసేన సైనికులు భారీగా తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతా జనం వచ్చి, దారి పొడవునా నీరాజనాలు పలికారు. బాణా సంచాల మోతలతో ఇసుకపాలెం పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా.. కాకర్ల సురేష్ రైతు కూలీలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయం పండుగ అవుతుంది, రైతుల కష్టం తీరుతుందని అన్నారు.
60 మంది సభ్యుల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారని రోస్ అవెన్యూ కోర్టు శనివారం తెలిపింది. ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ బీఆర్ఎస్ నాయకుడిని రిమాండ్కు తరలించాలని కోరుతూ ఈడీ చేసిన దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేశారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విచారణ సంస్థ కోరింది. అయితే, న్యాయమూర్తి ఆమెకు మార్చి 23 వరకు…
దేశంలో ఎన్నికల నగారా మోగింది. . దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది.