బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడింది.. బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్…
హోలీ భారతదేశంలోని పెద్ద, ప్రసిద్ధ పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా చోట్ల దీని ఆదరణ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మన దేశంలో హోలీ పండుగను జరుపుకోని చాలా ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఐపీఎల్ 17వ సీజన్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ లోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో 12000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచంలో ఆరో బ్యాట్స్మెన్గానూ, ఇండియా నుంచి ఈ రికార్డు సాధించిన తొలి బ్యాట్స్మెన్గానూ కోహ్లీ నిలిచాడు. విదేశీ బ్యాటర్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కోహ్లీ ఇప్పటివరకు 377…
విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారని, RTI ద్వారా NTPC తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కు NTPC నాలుగు సార్లు లేఖ రాసిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఅర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే పవర్ ను కాదని కమిషన్ల కోసం వేరొక చోట కొన్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్…
మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా…
కాసేపట్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై - ఆర్సీబీ తలపడుతున్నాయి. కాసపటి క్రితమే టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలించింది. మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు.…
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు.. సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.
పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన ప్రకటించింది. వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెడతారని తెలిపింది. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో.. పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన కసరత్తు ప్రారంభించింది. శక్తిపీఠం కొలువైన క్షేత్రం.. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచే ప్రచారం మొదలుపెట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి…
మార్చి 2న వీధికుక్కల గుంపు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన నాలుగేళ్ల బాలిక శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తాటిగూడ గ్రామానికి చెందిన భూక్య శాన్వి వీధికుక్క దాడిలో తీవ్రంగా గాయపడి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చేరింది. ఆమె ఒక రైతు అమర్ సింగ్కి ఏకైక కుమార్తె కాగా, ఆమె తల్లి సరిత గృహిణి. వీధికుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అమర్ సింగ్…