బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ మరోసారి ఇంగ్లండ్ క్రికెట్ ప్లేయర్లతో మమేకమయ్యారు. ఆట పట్ల మరోసారి తన అభిరుచిని అతడు చాటుకున్నారు. దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో తన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. కాగా, క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాని సునాక్ 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల ప్యాకేజీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్ పట్ల ఆసక్తి కనబరిచే వారికి ఈ ప్రోత్సాహం అందించేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
Read Also: Pemmasani: గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో ప్రచారంలో స్పీడ్ పెంచిన పెమ్మసాని..
కాగా, దాదాపు తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రణాళికలు తయారు చేసినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. ఇక, ఈ విషయాన్ని ప్రకటించే క్రమంలో లండన్‌లో ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు వర్ధమాన ఆటగాళ్లను ఆయన కలిశారు. ఈ సందర్భంగా.. ఆండర్సన్‌తో ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను షేర్ చేశారు. అదే విధంగా, యువ క్రికెటర్లను సైతం ఉత్సాహరుస్తూ వారికి రిషి సునాక్ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.
Read Also: Harsih Rao: బీజేపీ వాళ్ళు దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదు ఢిల్లీలో..
అయితే, ఆండర్సన్‌ను ఎదుర్కొనేందుకు తాను ముందుగానే నెట్ సెషన్‌లో పాల్గొన్నానంటూ యూకే పీఎం రిషి సునాక్ తెలిపారు. ఇందుకు సమాధానం ఇచ్చిన ఆండర్సన్ ఆయన అభిమానానికి ఫిదా అయ్యాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను సునాక్ షేర్ చేయగా.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పిలుపు కోసం సిద్ధంగా ఉన్నాను అని తన సెలక్షన్ గురించి ఈసీబీకి రిక్వెస్ట్ పెట్టారు. ఇక, ప్రధాని రిషి సునాక్ కు బదులిచ్చిన ఈసీబీ.. బాగానే ఆడారు.. కాకపోతే మీరు ఇంకొన్ని నెట్ సెషన్లు పూర్తి చేయాల్సి ఉంటుందని సరదాగా కామెంట్ చేసింది. కాగా, 2026లో మహిళా టీ20 ప్రపంచకప్, 2030లో పురుషుల టీ20 వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వబోతుంది.
Not bad, perhaps a few more net sessions first 😉 https://t.co/u7AHCOMO08
— England Cricket (@englandcricket) April 5, 2024