CM Chandrababu: ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి..
- ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు
- చంద్రబాబుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఈనెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకోసం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. షాధ్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇంత మంది తెలుగు వాళ్ళు ఉంటారనుకోలేదని అన్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం బీజేపీకే ఓటు వేయాలని తెలిపారు. ఢిల్లీలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు వాళ్ళు ఉన్నారు.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ నాయకత్వం గొప్పగా ఉందంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Read Also: Ind vs Eng 5th T20: దంచికొట్టిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్
Also Read
ప్రధాన మంత్రి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను.. ఇపుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీ గెలుపు దేశ చరిత్రలో ఒక మలుపు అని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో భారతీయులను ఎదుర్కొనే వాళ్ళు ప్రపంచంలో లేరు.. సరైన నాయకుడు సరైన సమయంలో దేశానికి మోడీ నేతృత్వం వహిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ప్రపంచం మొత్తం భారత దేశం బ్రాండ్ మోగుతోంది.. ప్రధాని మోడీ దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోతున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: Naga Chaitanya: అసలైన బుజ్జి తల్లి శోభితే.. కానీ ఆ విషయంలో చాలా ఫీల్ అయింది!
2047 నాటికి దేశం శక్తివంతంగా మారుతుంది.. 1995లో పాడుబడిన హైదరాబాద్‌లా ఢిల్లీ మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో పొల్యూషన్ డేంజర్‌గా ఉంది.. ఢిల్లీ నుంచి అందరూ హైదరాబాద్, బెంగుళూరు వెళ్తున్నారని అన్నారు. వెదర్ పొల్యూషన్, రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ కలుషితం అయిందని తెలిపారు. గర్వపడేలా దేశ రాజధాని ఉండాలి.. ఊపిరి పిల్చుకోవాలంటే, ప్రధాని మోడీ ఆక్సిజన్ ఇస్తేనే సాధ్యం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. భారత దేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు ఉంది.. కానీ ఢిల్లీ మాత్రం సమస్యల వలయంలో ఉందని ఢిల్లీ ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!