Subha Muhurtham Dates: శుభకార్యాలకు నేటి నుంచి 3 నెలలు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఎండాకాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ, ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా విరామం వచ్చింది. వచ్చే మూడు నెలల పాటు ఎలాంటి శుభ ముహూర్తాలు లేవపోవడమే దీనికి కారణమని వేద పండితులు చెబుతున్నారు. ఇవాళ (ఏప్రిల్ 29) నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు లేవని వెల్లడించారు. దీని వల్ల వివాహాలతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, శంకుస్థాపనల వంటి కార్యాలకు బ్రేక్ పడినట్లు అయింది.
Read Also: MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో ‘ఒకే ఒక్కడు’!
Also Read
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
కాగా, సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనంలో మార్పులతో శుభ ముహూర్తాలు పెట్టడం కుదరని వారు పేర్కొంటున్నారు. కాగా, వేద పండితులు తెలిపిన ప్రకారం.. ఈనెల 28వ తేదీ చైత్ర బహుళ చవితి ఆదివారం నాటి నుంచి జూలై 8వ తేదీ ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది. అలాగే గురు పౌఢ్యమి మే 7వ తేదీ చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్ 7వ తేదీ వరకు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగనుందని పేర్కొన్నారు.
Read Also: NTR : భార్యతో ముంబైలో ఎన్టీఆర్.. వీడియో వైరల్..
అలాగే, గురు, శుక్ర మూఢాల్లో కొత్త శుభ కార్యక్రమాలు చేయడం మంచిది కాదని పండితులు తెలియజేస్తున్నారు. ఇక, జూలై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదని వెల్లడించారు. మూఢాలు, ఆషాడ మాసం వల్ల దాదాపు అన్ని శుభ కార్యాలకు బ్రేక్ పడటంతో పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అలాగే, భాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి ఈ 3 నెలల పాటు కష్టాలు తప్పవనే చెప్పాలి. ఇక, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు మందగించే అవకాశం ఉంది. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు ఆశించిన గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!