Home
Telugu News
Telugu News News
-
Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు?
కూటమి మేనిఫెస్టో మమ్మల్ని అనుకరించినట్లుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కూటమి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదని.. జగన్ జర్నీని ప్రజలంతా గమనించారన్నారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరిందన్నారు. చెప్పింది చేస్తారన్న నమ్మకం ప్రజల్లో కుదరాలన్నారు. -
DK Shivakumar: కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు స్పందించిన డీకే..
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. సెక్స్ స్కాండల్ గురించి తెలిసి కూడా జనతాదళ్ (సెక్యులర్)తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై డీకే శివకుమార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు. -
MI vs LSG: లక్నో ముందు స్వల్ప లక్ష్యం.. ముంబై ఎంత స్కోరు చేసిందంటే..?
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లు చెలరేగడంతో ముంబై తక్కువ రన్స్ చేసింది. ఒకానొక సమయంలో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్.. నేహల్ వద్వేరా, టిమ్ డేవిడ్ ఆచితూచి ఆడటంతో ఓ మోస్తారు స్కోరును చేయగలిగింది. -
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలు అన్ని వస్తాయని.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వదలి బొమ్మాలీ… -
Harish Rao : ఢిల్లీలో మోడీకి, ఇక్కడ ఉన్న రేవంత్‌కి మాటలెక్కువ, చేతలుతక్కువ
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జగదేవ్ పూర్లో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దు అని రేవంత్ రెడ్డి అన్నారని, చెవేళ్ళలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి లో సునీతా, వరంగల్ లో కడియం కావ్య, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. కాకులు వాలనీయను అని చెప్పి గద్దలను ఎత్తుకు వెళ్లినవ్యక్తి రేవంత్ రెడ్డి అని… -
Perni Nani: కూటమి మేనిఫెస్టోపై పేర్ని నాని సెటైర్లు
ఏపీలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీ అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. -
T. Padma Rao Goud: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పద్మారావు గౌడ్..
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంబర్ పేట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్‌తో కలిసి అంబర్ పేట్ డివిజన్లోని న్యూ పటేల్ నగర్, నరేంద్ర నగర్, చెన్నారెడ్డి నగర్, సి బ్లాక్, రఘునాథ్ నగర్ కాలనీలలో పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. -
V Srinivasa Rao: ఏపీలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ?
అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. -
TSRTC : టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం
వికారాబాద్ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన ఎక్స్ వేదికగా.. ‘ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది. 2013లో డ్రైవర్‌గా ఆర్టీసీలో చేరిన రాజప్ప.. ఆరోగ్య సమస్యల కారణంగా అన్‌ఫిట్ అయ్యారు. 2018 నుంచి శ్రామిక్ గా డిపోలో పనిచేస్తున్నారు. గత నెలలో అధికారులకు… -
Mallikharjuna Kharge: పేదల హక్కులను హరించేందుకు చూస్తోంది.. బీజేపీపై తీవ్ర విమర్శలు
బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ 400కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలనుకుంటోందని.. అది పేదల సంక్షేమం కోసం కాదని అన్నారు. వారి హక్కులను హరించేందుకేనని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి వర్గం మెజారిటీ దిశగా పయనిస్తోందని.. అది గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ నిరుత్సాహానికి గురయ్యారని తెలిపారు. అందుకే ‘మంగళసూత్రం’, ‘హిందూ’ అంటూ…
తాజావార్తలు
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!