Off The Record: ధర్మవరంలో మ్యూట్ మోడ్‌లో బీజేపీ వరదాపురం సూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్ షా నుంచి గల్లీ లీడర్ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టారు. ఫ్యాన్ మీద పైచేయి కోసం బీజేపీ బెటాలియన్ మొత్తం దిగిపోతోంది. కానీ…. అదే పార్టీకి చెందిన ఒక్క ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడ్డం లేదట. పైగా సెగ్మెంట్‌లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకోని ఆ నియోజకవర్గ నేత ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?
టీడీపీ- బీజేపీ పొత్తు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కొన్ని చోట్ల ఆసక్తికరంగాను, మరికొన్ని చోట్ల తీవ్ర వివాదాస్పదంగాను మారుతున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్. ఇక్కడ దశాబ్దాల పాటు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పోరు నడిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్లేస్‌లోకి వైసీపీ వచ్చేసింది. కానీ… ఈ విడత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ, వైసీపీ మధ్య పోరు యమా ఇంట్రస్టింగ్‌గా జరుగుతోంది. కానీ…అందులో స్థానిక బీజేపీ నేత మిస్ అవడం ఇంకా ఆసక్తిరేపుతోంది. ఇన్నాళ్ళు ఢిల్లీ రాజకీయాల్లో మాత్రమే కనిపించే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగి ధర్మవరం బరిలో నిలిచారు. కానీ… సత్య కుమార్ స్థానంలో ఇక్కడ ఆ పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. ధర్మవరంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు నాలుగున్నరేళ్ళ నుంచి ఇక్కడే ఉండి పార్టీ బాధ్యతలు చూస్తున్నారాయన. అటు బీజేపీలో ఉన్న సూర్యనారాయణ చివరి వరకు తమ పార్టీ తరపున తనకు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పొత్తుల్లో భాగంగా ఆయనకు దాదాపు టికెట్ ఖరారైందన్న ప్రచారం కూడా జరిగింది.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
ఇదే సమయంలో మాక్కావాలంటూ…టీడీపీ, జనసేన నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఆందోళనలు సైతం జరిగాయి. కానీ.. ఒక్కరోజులోనే సీన్ మొత్తం తారుమారైంది. మొత్తం పరిస్థితులన్నీ గమనించిన తర్వాత బిజెపి అధిష్టానం గోనుగుంట్ల సూర్యనారాయణకు కాకుండా ఆ స్థానంలో సత్యకుమార్‌ను దింపింది. వాస్తవానికి హిందూపురం ఎంపీగా పోటీ చేయాలనుకున్నారట సత్యకుమార్. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని ఫిక్సయి బీజేపీకి ఇచ్చేందుకు ససేమిరా అనంతో చివరికి ధర్మవరంను వదులుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఫైనల్‌గా లెక్కలు తేలిపోవడంతో…కూటమి ధర్మం ప్రకారం టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సత్య కుమార్ వెంట తిరుగుతూ మొత్తం నియోజకవర్గంలో అందరికీ పరిచయం చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కానీ… సొంత పార్టీ నేత అయిన సూరి మాత్రం పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశం అయింది. సూర్యనారాయణ ధర్మవరం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.
కానీ ఆయన నామినేషన్ వేయలేదు. అలాగని ఎవరి తరపున ప్రచారం కూడా చేయడం లేదు. కొన్ని రోజుల నుంచి కంప్లీట్ మ్యూట్ మోడ్‌లోనే ఉన్నారాయన. మరో వ్తెపు సత్య కుమార్ గెలుపు కోసం బిజెపిలో గల్లీ నుంచి ఢిల్లీ లీడర్ వరకు నేతలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అంత మంది వస్తున్నా… స్థానికంగా పట్టున్న సూరి మాత్రం కూటమి ప్రచారానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్ అయింది. పోలింగ్ టైం దగ్గర పడుతోంది. ప్రచారానికి కూడా పెద్దగా టైం లేదు. ఈ పరిస్థితుల్లో వరదాపురం సూరి అలియాస్ సూర్య నారాయణ ఏం చేస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు. ఆయన కేడర్, ముఖ్య అనుచరులు ఎటువైపు ఉంటారన్నది కూడా ఇంట్రస్టింగ్ పాయింట్ అయింది.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!