Hema : సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు.
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దిష్ట షరతులతో చర్చించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని ఈసీ షరతు విధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అప్పటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో.. రాత్రి 10.30 గంటల వరకు వేచి చూశారు. ఒకానొక సమయంలో వర్షం కురవడం ఆగిన తర్వాత గ్రౌండ్ మొత్తాన్ని గ్రౌండ్ సిబ్బంది రెడీ చేశారు. దీంతో.. అంఫైర్లు కూడా మ్యాచ్ జరిపించేందుకు సిద్ధం చేశారు. కాగా.. ఈ క్రమంలో..…
‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ అంటే ఒక పెద్ద గౌరవం, దీని కోసం ఒక విద్యార్థి చాలా కష్టపడాలి, పిల్లికి అదే గౌరవం లభిస్తే … ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తి పద్ధతులు. అసలైన, వెర్మోంట్ స్టేట్ యూనివర్శిటీ ఇటీవల ఒక పిల్లికి ఈ గౌరవాన్ని ఇచ్చింది. ఇప్పుడు మానవ ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యత నిరంతరం పెరుగుతోంది. దీనికి ఇటీవల చాలా ఉదాహరణలు మనం చూశాం. ఇది కొంతమందికి షాకింగ్‌గా అనిపించవచ్చు కానీ ఇప్పుడు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గుహవాటిలోని బర్సాపరా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ.. వర్షం పడటంతో ఆలస్యమైంది. దీంతో.. మ్యాచ్ ను 7 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 10.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ లో టైమ్ ఔట్స్ ఏమీ లేవు. ఇదిలా ఉంటే..…
దేశంలో రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 14, మహారాష్ట్రలోని 13 స్థానాల్లో అత్యధికంగా ఓటింగ్ జరుగుతోంది. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, లడఖ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
సమాజంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిందితులకు కఠినశిక్షలు విధిస్తున్నప్పటికీ కామాంధులు ఆగడం లేదు. తాజాగా.. జార్ఖండ్ రాష్ట్రంలో ఓ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చక్రధరపూర్లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు తన ఉపాధ్యాయ పదవికి, సామాజిక, కుటుంబ సంబంధాలకు మచ్చ తెచ్చాడు. 65 ఏళ్ల రిటైర్డ్ టీచర్ తన సొంత మైనర్ మేనకోడలిపై కామ కోరికలు తీర్చుకుని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. కాగా.. ఈ వ్యవహారం ప్రజలకు తెలవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై…
PM Modi: తరగతి గదిలో ‘‘మోడీకి ఎవరూ ఓటు వేయద్దు’’ అని చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీకి ఎవరూ ఓటేయద్దని చెప్పడం వివాదాస్పదమైంది.
కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కార్ కు పట్టవా? అన్ని రకాల వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాల్సిందే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విపలమైన ప్రభుత్వం… పండించిన వడ్లను సైతం సకాలంలో కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుండటంతో కొనుగోలు…
‘‘మనీష్ సిసోడియా అక్కడ ఉండుంటే..’’ స్వాతిమలివాల్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరగడం సంచలనంగా మారింది. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తను చెంపపై ఏడెనిమిది సార్లు కొట్టాడని, తన కడుపులో, ఛాతిపై తన్నాడని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎన్నికల ముందు ఆప్‌కి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. మొత్తం వ్యవహారమంతా బీజేపీ…