గత 35 ఏళ్ల తర్వాత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 58.46 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ ప్యానెల్ పేర్కొంది. 2019తో పోల్చితే కశ్మీర్ లోయలో 30 శాతం భారీగా పెరిగిందని తెలిపింది. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలంగా ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్…
శ్రీధర్‌రెడ్డి హత్య నిందితులను అరెస్ట్ చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని తెలంగాణ డీజీపీని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఇటీవల వనపర్తి జిల్లా లక్ష్మిపల్లిలో హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డిలు డీజేపీని కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హత్య కు గురైన శ్రీధర్ రెడ్డి హత్య పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ కి ఫిర్యాదు చేసామన్నారు. హత్య జరిగి నాలుగు రోజులు అవుతుందని,…
లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రుల ప్రాబల్యం తగ్గుతోంది. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో 37 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయపతాకం ఎగురవేశారు. 1957 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది స్వతంత్ర ఎంపీలు గెలుపొందారు. కానీ 2019లో ఈ సంఖ్య కేవలం నలుగురు స్వతంత్ర ఎంపీలకు తగ్గింది. దేశంలో అత్యల్ప స్వతంత్ర ఎంపీల సంఖ్య 2014లో కేవలం ముగ్గురు మాత్రమే నిలిచారు.
ఉప్పల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డు! ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనన్లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్ఆర్హెచ్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్ఆర్హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌కు చిన్న ఓదార్పు దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఐపీఎల్…
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గత ఏడాది నవంబర్ 30న జనగాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను నామినేట్ చేయగా, బిజెపి జి…
ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన సమావేశంలో కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని.. ఆరో దశలో 400 దాటిందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని దుయ్యబట్టారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు, సమాజ్‌వాదీ పార్టీకి నాలుగు సీట్లు కూడా రావని ఆరోపించారు.
మందుబాబులతో పెట్టుకుంటే మాములుగా ఉండదు. వారి కెపాసిటీ జోలికి వస్తే.. లెక్క తేల్చేస్తారు. అలాంటిదే ఈ ఘటన. యూకేకు చెందిన ఓ మద్యం దుకాణంలో ఓ బీర్ టేస్ట్ నచ్చడంతో.. ఆ బీర్ కోసం జనాలు బారులు తీరారు. అంతేకాకుండా.. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్ పెట్టేందుకు పోటెత్తడంతో.. ఆ మద్యం దుకాణంకు చెందిన వైబ్సెట్ డౌన్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. UKలోని లింకన్షైర్లోని బిల్లింగ్హేలో ఉన్న ఒక పబ్‌లో తన ‘ఒసామా బిన్ లాగర్’ బీర్‌ను కొనుగోలు చేయడానికి…
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన డంపర్ ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఈరోజు (సోమవారం) ఉదయం జరిగింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాట్నాలోని భక్తియార్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూన్ 4న ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అగ్నివీర్ పథకాన్ని అంతం చేస్తామని పేర్కొన్నారు.
తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్ గా మారింది..…