ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా నియామకమయ్యారు. కేంద్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా రిలీవయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కార్తికేయ మిశ్రా రిపోర్ట్ చేశారు.
రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఆదివారం నాడు రాష్ట్ర శాసనసభ సమావేశాల ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై ఒత్తిడి తేవాలి. నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి నిజమైన డిమాండ్ల కోసం గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పార్టీ విద్యార్థి నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. నిరాహార దీక్ష…
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన క్రెడిట్‌ను సిగ్గులేకుండా క్లెయిమ్ చేసుకునేందుకు తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను వాస్తవాలు , గణాంకాలతో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాతో విమర్శలు గుప్పిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కృషి వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల విలీనం కల సాకారమైందని కాంగ్రెస్ పేర్కొంది. ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ ఇలా అన్నారు: “రక్షణ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చేసిన విజ్ఞప్తులు ఫలించాయి.…
హైదరాబాద్ బంజారా లెక్ వ్యూ లో మన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చట్టాలకు పాతర వేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసపూరిత పార్టీలు.. రెండు పార్టీలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఏపీ, తెలంగాణ,పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు పవన్‌ను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను డెప్యూటీ సీఎంకు వివరించారు. క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అందించొద్దని వినతి పత్రాన్ని అందించారు.
స్టార్ హాస్పిటల్స్ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లలో అతిపెద్ద జాయింట్ రీప్లేస్మెంట్ & ఆర్థోపెడిక్స్ పోస్ట్-సర్జరీ పేషెంట్ వాకథాన్ – STAR ORTHO360 WALKATHON 2024 నిర్వహించింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి 250 మందికి పైగా హాజరైన ఆర్థోపెడిక్స్, శస్త్రచికిత్స అనంతర రోగులకు ఎముక , కీళ్ల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తుంది. ఈ కార్యక్రమానికి కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కామినేని శ్రీనివాస్ గారు , ఆంధ్రప్రదేశ్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ,…
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్ హామీ కొంచెం లేటైనా నెరువేర్చుతామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో క్షుణ్ణంగా పరిశీలించి ఏపీలో అమలు చేస్తామని వెల్లడించారు.
స్టార్ మా లో "చిన్ని" సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. స్టార్ మా ప్రేక్షకులకు ఇది ఓ కొత్త అనుభూతి. ఒక చిన్న పాప కథగా మొదలై, ఆమె పెరిగి పెద్దదయ్యే క్రమంలో చూసే కథంతా ఎన్నో మలుపులు.. మెరుపులు !! తప్పక చూడండి.
కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సంచలన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్రం. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన కల నెరవేరింది. కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోవడం 28న దీనికి సంబంధించిన…