Padi Kaushik Reddy : నా ప్రజల జోలికి వస్తే ఎంత వరకైనా వస్తా.. ఊరుకునేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ లో కల్యాణ లక్ష్మీ చెక్కులని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్ద పోరాటంతో శాసనసభ్యునిగా కోర్టులో జీవో తో కమలాపూర్ మండలంలో 80 మందికి చెక్కులు పంచామన్నారు. దయచేసి నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి.కానీ నా నియోజకవర్గ ప్రజల మీద తీర్చుకోకండని, నా ప్రజల జోలికి వస్తే ఎంత వరకైనా వస్తా.ఊరుకునేది లేదన్నారు. ఈ చెక్కులు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు అని, డిసెంబర్ 9 తరువాత తులం బంగారం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్వో కార్యాలయంలో తులం బంగారం వచ్చిందా అంటే రాలేదు అన్నారని, మళ్ళీ 108 మంది లబ్ది దారులకు తులం బంగారం రావాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
ఇప్పటి వరకు చెక్కులు ఇచ్చిన లబ్ది దారులకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 5 మండలాల్లో దాదాపు 400 వందల చెక్కులు లాప్స్ అయ్యాయని, తిరిగి మళ్ళీ రేన్యూవల్ చేస్తాం అని అధికారులు తెలిపారన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జాగ్రత్త అని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు చాలా కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతున్నారు ఈటెల రాజేందర్ ఉన్నప్పుడు చెక్కులు కౌశిక్ రెడ్డి పంచలేదా…. అని ఆయన ప్రశ్నించారు.
మళ్ళీ చెప్తున్న ఆ రోజు ఈటల రాజేందర్ ను పిలిచాను, తను రాకపోతే నేనేం చేయాలని, ఒక్కటి చెప్తున్న నేను చెక్కులు పంపిణీ చేస్తా అంటే ప్రభుత్వ కార్యాలయంలోనే ఇవ్వాలి అని అన్నారు ఇచ్చాను. కౌశిక్ రెడ్డి గొంతు నొక్కాలి అని చూస్తున్నారు.. మీ తరం కాదు.. మీబిడ్డ చెప్తున్న తప్పకుండా ప్రజల్లోకి వస్తాను. నా గళం వినిపిస్తాను.’ అని కౌశిక్ రెడ్డి అన్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?