మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు నేడు తెరచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు ఎత్తనున్నారు. బాబ్లీ ప్రాజెక్టును తెలంగాణ -మహారాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కేంద్ర జల సంఘం ప్రతినిధులు సందర్శించనున్నారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్‌ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది.
ఐఎస్ సదన్‌లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ శనివారం రాత్రి ఛేదించి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. రూ.లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 25.50 లక్షలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ (సెంట్రల్) జోన్ బృందం మారుతీనగర్ ఐఎస్ సదన్‌లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మహ్మద్ అబ్దుల్ సోహైల్ (28), మహ్మద్ ఫర్హతుల్లా (55)లను పట్టుకున్నారు. “సొహైల్…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపట్నుంచి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
టీ20 ఫార్మాట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు విరాట్ కోహ్లీ, రోహిత్‌శర్మ బాటలోనే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఇంటర్నేషనల్‌కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఒక్కరోజు తర్వాత జడేజా ఈ ఫార్మాట్‌కు బై బై చెప్పాడు. రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో 4 లైన్ల సందేశాన్ని రాసి తన భావాలను వ్యక్తం చేశాడు. జడేజా ఇలా రాశాడు.. “నేను కృతజ్ఞతతో…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది.
తెలంగాణలో క్రికెట్‌కు కొత్త జోష్ రానుంది. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరుపనుంది. తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం కలుగనుంది. బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. మహిళల లీగ్…