No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Number Plate, No Fuel: వాహనాలకు నంబర్ ప్లేట్ లేకపోతే ఇకపై పెట్రోల్, డీజిల్ పోయించుకోలేరు.. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో నంబర్ ప్లేట్ లేని వాహనాలకు ఇంధనం విక్రయించడాన్ని అధికారులు నిషేధించారు. గుజరాత్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి నగరంగా రాజ్‌కోట్ నిలిచిందని అధికారులు తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదన్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిబంధన రెండు నెలల పాటు కొనసాగనుంది. నగరంలోని అన్ని రకాల వాహనాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
ప్రతి తనిఖీలో 100కు పైగా వాహనాలు
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై పోలీసులు ఇప్పటికే నగరవ్యాప్తంగా పలుమార్లు 15 రోజుల పాటు ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రతిసారీ 100కు పైగా నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించడం కష్టంగా ఉండటంతో నగర భద్రతకు ఇవి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సాధారణ నిఘా వ్యవస్థలకు చిక్కకుండా ఇలాంటి వాహనాలను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Also Read
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
నేరాలకు వాహనాల వినియోగం
నంబర్ ప్లేట్ లేని.. లేదా గుర్తించడం కష్టమైన వాహనాలు నిర్లక్ష్యపు డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో ఉపయోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చైతన్య మండ్లిక్ మాట్లాడుతూ.. నగరంలో నిర్వహించిన ప్రతి ప్రత్యేక తనిఖీలో 100కు పైగా నంబర్ ప్లేట్ లేని వాహనాలు బయటపడుతున్నాయని చెప్పారు. ఇలాంటి వాహనాలు దొంగతనాలు, దోపిడీలు తదితర నేరాల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఉగ్ర కార్యకలాపాల్లోనూ వినియోగించే అవకాశం
నంబర్ ప్లేట్ లేని వాహనాలను నేర కార్యకలాపాలకు మాత్రమే కాకుండా ఉగ్ర కార్యకలాపాల్లోనూ ఉపయోగించే అవకాశం ఉందని చైతన్య మండ్లిక్ పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని నంబర్ ప్లేట్ లేని ఏ వాహనానికీ ఇంధనం అందించకూడదని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకులపై చర్యలు
నంబర్ ప్లేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయించే ఫ్యూయల్ స్టేషన్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇంధనం సరఫరా చేసే బంకులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు నగరంలోని పెట్రోల్ బంకులపై నిఘా పెట్టారు. ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి ఫ్యూయల్ అవుట్లెట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు ఇంధనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నగర భద్రతను పెంచడంతో పాటు నంబర్ ప్లేట్ లేని వాహనాల వినియోగాన్ని అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ చర్యతో వాహనాల గుర్తింపు, నేర నియంత్రణ మరింత సులభమవుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!