గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్.వి.ఆర్.అండ్ జే.సి. ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ ఏఐ హ్యాక్ థాన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును పరిశీలించనున్న చంద్రబాబు. నేడు విశాఖలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, CS పర్యటన. ఇవాళ సాగర్‌నగర్‌లో EPDCL సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభం. స్కాడా భవనం సందర్శించనున్న మంత్రి గొట్టిపాటి…
నేడు కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్.. సొంత నిధులతో..! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్…
రిషబ్ పంత్‌కు కెరీర్ ఉత్తమ ర్యాంకు! ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పురోగతి సాధించాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్ కెరీర్ ఉత్తమ ర్యాంకు అందుకున్నాడు. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని.. ఏడో స్థానంలో నిలిచాడు. లీడ్స్ టెస్ట్‌లో పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో…
నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీలో పాల్గొననున్న చంద్రబాబు. రెండు రోజుల పాటు గుంటూరులోనే చంద్రబాబు పర్యటన. నేడు సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికకు సీఎం రేవంత్. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. ప్రత్యేక అతిథిగా హాజరుకానున్న హీరో రామ్‌చరణ్. రాజమండ్రిలో కేంద్రమంత్రి షెకావత్, పవన్ పర్యటన. నేడు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు…
ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.. జేడీ వాన్స్ కీలక ప్రకటన ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత.. ఇరాన్‌కు అణు సామర్థ్యం లేదని ప్రకటించారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు…
నేడే ఏపి క్యాబినెట్ భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం..! నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఏపి క్యాబినెట్ భేటీ అమరావతి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి…
నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. తర్వాత పీసీస అడ్వైజరీ కమిటీ సమావేశం. మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాల అందజేత. చెవిరెడ్డి మోహిత్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ. లిక్కర్ స్కాంలో ఏ39 నిందితుడిగా ఉన్న మోహిత్‌రెడ్డి. అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. రాజధాని నిర్మాణానికి మరింత భూ…
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్‌పై ఎఫెక్ట్! ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర…
చిరు – అనిల్ మరో షెడ్యూల్ స్టార్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా…
ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బంధువులు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.