Soumya Rao : జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయిపోయింది సౌమ్యరావు. కన్నడ బ్యూటీ అయినా.. తెలుగులో మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు తాను యాంకర్ గా ఉన్నా.. అంతకు ముందు పడ్డ కష్టాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. తాజాగా మరోసారి బయట పెట్టేసింది. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పులు భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పులోళ్లు వచ్చి మా అమ్మను తిట్టేవాళ్లు. ఓ రోజు వాళ్ల బాధ భరించలేక తిరుపతికి మమ్మల్ని తీసుకుని వచ్చింది మా అమ్మ. రాత్రంతా బస్టాండ్ లోనే పడుకున్నాం. తిరుపతిలో అన్నదానం పెడుతారని ఎంతో ఎదురు చూశాం. మా ఇంట్లో సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు. చాలా సార్లు పస్తులతో పడుకున్న రోజులు గుర్తున్నాయి.
Read Also : RGV : కుక్కలనే పెళ్లి చేసుకోండి.. డాగ్ లవర్స్ కు ఆర్జీవీ కౌంటర్
నేను కాలేజీ చదివేటైమ్ లోనే పార్ట్ టైమ్ జాబ్ చేశాను. ఓ లాయర్ దగ్గర టైపిస్ట్ గా పనిచేస్తుంటే అతను నా బాడీ మీద ఇష్టం వచ్చినట్టు చేతులు వేసి తాకేవాడు. నాకు చాలా అసభ్యంగా అనిపించేది. నా పరిస్థితి అతనికి తెలుసు. దాన్నే అలుసుగా తీసుకుని రెచ్చిపోయాడు. ఆ తర్వాత అక్కడ మానేసాను. యాంకర్ గా అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చాలా కష్టాలు దాటుకుని జీరో నుంచి ఇక్కడి దాకా వచ్చా. అందుకే నాకు సెలబ్రిటీ అనే ఆలోచన ఉండదు. ఇప్పటికీ ఈవెంట్లకు ఆటోలో వెళ్లేందుకు కూడా మొహమాట పడను అంటూ తెలిపింది సౌమ్యరావు.
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు మూవీకి అలా చేస్తే ఓపెనింగ్స్ రావన్నారు.. నిర్మాత కామెంట్స్