మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడు పాయల ఆలయం గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట 8 రోజులుగా మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది.
ఖమ్మం జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఏళ్లుగా పెండింగ్‌లోఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు అప్పగిస్తారు. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. అయితే కొన్ని సీజన్లుగా మిల్లర్లు సీఎంఆర్ అప్పగించకుండా పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఈ జలాశయం ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
"మా నాన్న ఎప్పుడూ కొడుతున్నాడు..నాకు నాన్న వద్ద.. నేను హాస్టల్లోనే ఉంటా.." అంటూ ఓ పన్నెండేళ్ల బాలిక సోమవారం జగిత్యాల పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ పన్నెండేళ్ల బాలిక తన గోడును వెళ్లబోసుకుంది.
అక్టోబర్ 1(నేటి) నుంచి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
మంత్రి కొండా సురేఖ గాంధీ భవన్ లో భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. తాను.. నిన్నటి నుంచి అన్నం తినలేదని, నిద్రకూడా పట్టలేదంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి హోదాలో కొండా సురేఖ వెళ్లారు. అక్కడ ఎంపీ అయిన.. రఘునందన్ రావు.. పూలమాల వేసి మంత్రిగారికి వెల్ కమ్ చెప్పారు. కొంత మంది దీన్ని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు.…
తెలంగాణలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 30) విడుదల చేశారు. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన, దసరా పండుగకు ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. సీఎం ప్రకటించిన ప్రకారం, టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల…
హమాస్ అధినేత జాడ తెలిసినా చంపకుండ వదిలేసిన ఇజ్రాయెల్.. హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఉన్న ప్రదేశం తెలిసిన కూడా ఇజ్రాయెల్ అతడిని మట్టుబెట్టకుండా వదిలేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్12 న్యూస్ ఓ కథనంలో తెలిపింది. ఇటీవల ఐడీఎఫ్ బలగాలకు సిన్వార్ కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చింది. అక్కడే పలువురు బందీలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఛాన్స్ ను వినియోగించుకొని అతడిని చంపేస్తే.. అది బందీల ప్రాణాలకు తీవ్ర…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. 25 ఓవర్లలోనే భారత్ 200 పరుగులు చేసింది. టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా అత్యంత వేగంగా 200 పరుగులు చేయడం ఇదే మొదటి సారి. ఈ క్రమంలో.. భారత్ ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే... వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 27 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు…
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా వ్యవహారం మారింది.