ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు కన్నెర్ర చేశారు. అధికారుల అలసత్వం మిల్లర్లు ఇష్టారాజ్యంతో కోట్లాది రూపాయల ధాన్యం అక్రమార్కుల చేతిలో కి వెళ్లడం పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కు మంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అక్రమంగా ధాన్యం తరలింపు పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. ధాన్యం పక్కదారి పట్టడానికి కారకులను…
పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని హైడ్రా అధికారులు వెల్లడించారు. ప్రజలు గమనించాలి.. అసత్య ప్రచారాలు నమ్మొద్దని, హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరుకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, హైడ్రా పేదల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాసం ఉంటే ఆ ఇళ్లను కూల్చదన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రావి కావు. ప్రజలు, సామాజిక…
ఏపీలో మద్యం ప్రియులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగకు ముందే మద్యం షాపులు అందుబాటులోకి వస్తాయని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ప్రభుత్వం మద్యం పాలసీ ద్వారా దోపిడీ చేసింది.. ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ షాప్స్ నిర్వహణ జరిగేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
టాలీవుడ్‌లోని ఆరాధ్య జంటల్లో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఒకరు. ఎన్టీఆర్ వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఇంకా తన ఫ్యామిలీ గురించి విషయాలను ఎన్టీఆర్ ఎక్కడా ప్రస్తావించడు. ఇదిలా ఉంటే.. తారక్ తనతో పాటు తన భార్య గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఓ టాక్ షోలో వెల్లడించాడు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర్కార్ ఒక్క ఇల్లు కూడా తొలగించలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో సీఎంకి వ్యతిరేకంగా పెయిడ్ ప్రచారం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ వందల కోట్లు సోషల్ మీడియా పై పెట్టుబడి పెట్టిందని ఆయన ఆరోపించారు. జన్వాడ ఫాం హౌస్ చుట్టూ జరిగిన అభివృద్దే.. హైదరాబాదు అభివృద్ధా? 2015_16 లో మల్లన్న సాగర్ లో…
వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మూడు రోజుల పర్యటనకు జపాన్ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం హానిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాష్ ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతోపాటు రాష్ట్ర బృందం లో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణ రావు, ఇంధన శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్,…
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంతో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ షోలో ప్రముఖ హీరోల నుంచి మొదలు పెట్టి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇంతకుముందు.. మొదటి, రెండు సీజన్లు ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిచి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే దసరా కానుకగా మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. హీరో దుల్కర్ సల్మాన్…
పోటీకి వైసీపీ దూరం.. పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ..! గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భారీ విజయాన్ని అందుకున్నారు.. ఇక, జనసేన ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తుండగా.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అయితే, ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఓ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉండగా..…
మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఆందోళనలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరణ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతంలో నివాసితుల భద్రత, పునరావాసం, కూల్చివేతలకు సంబంధించిన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, కమిషనర్ కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. మూసీ నదికి ఇరువైపులా జరుగుతున్న సర్వేలు హైడ్రాకు సంబంధించినవి కాదని స్పష్టంగా అవగాహన చేయాలని కోరారు. ఈ సర్వేలు హైడ్రా చట్టం లేదా ప్రాజెక్టుకు సంబంధించినవి కాదని తెలిపారు. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో…
టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 పరుగులు చేసిన జట్టుగా భారత్ అవతరించింది. కేవలం 3 ఓవర్లలోనే 50 రన్స్ చేసి వరల్డ్ రికార్డు నమోదు చేసిన రోహిత్, జైస్వాల్ జోడీ.. ఆ తర్వాత అత్యంత వేగంగా 100, 150, 200 రన్స్ కూడా భారత్ చేసింది.