Swachh Bharat: మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014, అక్టోబర్ 2 న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటితో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ పదేళ్లు పూర్తి చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలసి స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ రోజు ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని కోరారు.
Read Also: PM Modi: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు
ప్రజల చొరవ ‘క్లీన్ ఇండియా’ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ‘నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ చొరవ స్వచ్ఛభారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది’ అని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో స్వచ్ఛతా హి సేవా 2024 కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రతకు సంబంధించి రూ.9600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
गांधी जयंती पर आज अपने युवा साथियों के साथ स्वच्छता आभियान का हिस्सा बना। मेरा आप सभी से आग्रह है कि आज आप भी अपने आसपास स्वच्छता से जुड़ी मुहिम का हिस्सा जरूर बनें। आपकी इस पहल से ‘स्वच्छ भारत’ की भावना और मजबूत होगी। #10YearsOfSwachhBharat pic.twitter.com/MvjhazPAvl
— Narendra Modi (@narendramodi) October 2, 2024