AV Ranganath : హైడ్రా కీలక నిర్ణయం.. యాప్‌ను తీసుకువస్తున్న హైడ్రా
- చెరువులకు పూర్వ వైభవం
- నగరంలో చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటక్షన్ కమిటీ సమావేశం
- ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్
- యాప్‌లోనే ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నగరంలో చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సోమవారం హైడ్రా కమిషనర్ ,లేక్ ప్రొటక్షన్ కమిటీ ఛైర్మెన్ ఏవీ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా.. నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది హైడ్రా. ఎక్కడ ఆక్రమణలు జరుగుతున్నా యాప్ ద్వారా సమాచారం క్షణాల్లో హైడ్రాకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యాప్‌లోనే ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం, క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన, చర్యల నమోదు ఉంటుంది.
Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా స్పెషల్ ఎడిషన్ త్వరలో విడుదల.. డిటైల్స్ లీక్
Also Read
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడమే కాదు.. వాటికి పూర్వవైభవం తీసుకువచ్చే పనిలో హైడ్రా ఉంది. ఆక్రమణలు తొలగించిన చెరువుల్లో డెబ్రీస్‌ను పూర్తి స్థాయిలో తొలగించడం, మొదటి దశగా సున్నం చెరువు, అప్పాచెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి, ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి లెక్కలు తేల్చాలంటూ అధికారులకు సూచించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతుల అనుసరించే అంశాలపై సమీక్ష నిర్వహించారు. గతంలో నిర్ధారించిన ఎఫ్‌టీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని సవరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
Congress vs MIM : ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ
45 ఏళ్ల డేటా ఆధారంగా చెరువుల ఎఫ్‌టీఎల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించనున్నారు. ఇందుకు ఎన్ఆర్ఎస్ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల డేటాతో సరిపోల్చి నిర్ణయం తీసుకోనున్నారు. విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమచారం ఇచ్చే కాడాస్ట్రల్ మ్యాప్స్ , 45 ఏళ్లలో పూర్తి స్థాయిల చెరువు నీరు విస్తరించిన తీరుపై సమాచారం సేకరించనున్నారు. హిమాయత్ సాగర్‌తో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటించేందుకు చర్యలు చేపట్టనున్నారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచ్చిన నివేదిక పరిశీలించి, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చెరువులను గుర్తించేందుకు కసరత్తు ప్రారంభించారు. చెరువుల పరిరక్షణపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపైనా సమీక్ష నిర్వహిస్తున్నారు.
Tomato Price : మళ్లీ మోత మోగిస్తున్న టమాటా ధర.. హైదరాబాద్ లో కిలో రూ.100
తాజావార్తలు
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!