కడప జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మరణం విషాదకరమని హోం మంత్రి వంగలపూడి అనిత విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి కోలుకోలేక ఆస్పత్రిలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికరమన్నారు. బాలికపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు.
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేశాడు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను బెంగళూరుకు చెందిన సాయి కుమార్‌కు అధిక ధరకు విక్రయించిన ఓ ప్రజాప్రతినిధి. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నట్లు ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు.
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల భద్రతపై ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) జితేందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రక్రియకు అంతరాయం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో, డిజిపి జితేందర్ సంభావ్య నిరసనల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ, “కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు జరుగుతాయి. ఎవరైనా నిరసనగా వీధుల్లోకి వచ్చి ప్రజా శాంతికి భంగం కలిగిస్తే…
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. 44-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఈ సీజన్ తన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది.
చెంబూర్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు మహారాష్ట్రలోని ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. స్టేషన్ వెలువల భారీగా ప్రజలు గుమిగూడారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పొగ సమీప…
కర్వాన్ డివిజన్, కేసరి నగర్ హనుమాన్ టెంపుల్ ప్రాంతంలోని మూసీ పరిధిలో పర్యటించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మూసీ పరివాహక ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలు ఒక్కో ఇటుక పేర్చి, కష్టపడి ఇండ్లు కట్టుకున్నారు. అందుకు ఇక్కడి ప్రజలే సాక్ష్యమన్నారు. 30 ఏండ్ల కిందటే ఇక్కడ నిర్మించుకున్న ఇండ్లకు కరెంట్ కనెక్షన్లతో పాటు నీటి సదుపాయం, రేషన్ కార్డులు, ఆధార్…
పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ ప్యానెల్‌లోని చాలా మంది సభ్యులు సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేలా పన్నులను తగ్గించడాన్ని సమర్థించారు. జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటుపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందం శనివారం సమావేశమైంది. ఇందులో సీనియర్ సిటిజన్లు జీవిత బీమా, ఆరోగ్య బీమా కోసం…