భక్తుల దర్శనాలపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కార్తీక శని, ఆది,సోమ,పౌర్ణమి,ఏకాదశి రోజులలో సామూహిక,గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది.
బీహార్లో మద్యంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం దందా, అక్రమ మద్యం రవాణా పెరుగుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 37 మంది మృతి చెందారు. ఈ కేసులో మొత్తం ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు.
Minister Nara Lokesh: రాష్ట్రంలోని పాఠశాలల్లో కొత్తగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6,762 కోట్లు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరిని కలిసిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి పలు వినతిపత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని 32,818 పాఠశాలల్ల్లో తరగతి గదుల మరమ్మతులు, టాయ్ లెట్లు, తాగునీటి…
పారిశ్రామికరంగాన్ని గాడిలో పెట్టి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 25వ తేదీనుంచి వారంరోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాదిమంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం.
ఏపీలో ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పుల వల్ల ఎన్జీటీ పెనాల్టీలు వేసిందన్నారు. అప్పట్లో ప్రభుత్వం మీద ఎన్జీటీ పెనాల్టీలు విధించిందని తెలిపారు. 35 లక్షల టన్నులు పారదర్శకంగా అప్పట్లో మేం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఇచ్చామన్నారు
మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ లో భాగంగా తొలిఅడుగు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా అందిస్తున్నామన్నారు. అక్టోబర్ 31న డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చెప్పారని వెల్లడించారు.
ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా మాజీ ఐపీఎస్ అధికారి అనురాధ నియామకమయ్యారు. ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా మాజీ ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
కడప జిల్లా బద్వేల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. యువకుడి చేతిలో హత్యకు గురైన యువతి కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. శనివారం ఘటన జరిగితే ఎవరు పట్టించుకోలేదని.. కేవలం తాను వస్తున్నాను అని బాధితులకు సహాయం అందించారని ఆయన అన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, ప్రజలకు భరోసా లేదని తీవ్రంగా మండిపడ్డారు.
ప్రేమించానని మాయ మాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా శ్వాస, నువ్వే నా జీవితం అంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పి దాదాపు ఏడేళ్లు ఆ అమ్మాయితో కలిసి తిరిగాడు. చివరకు పెళ్లి చేసుకుందామని అమ్మాయి అడగగానే ఏదో ఒకటి సాకు చెప్పుకుంటూ, లైఫ్ ఎంజాయ్ చేద్దామంటూ దాట వేసుకుంటూ వచ్చాడు. చివరకు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇదేంటి అని ప్రేమించిన అమ్మాయి గట్టిగా నిలదీస్తే..…
కృష్టా తీరంలో జరిగిన అమరావతి డ్రోన్ షో సందర్శకులను అబ్బురపరిచింది. అమరావతి డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ధ్రువపత్రాలను అందించారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ పేరిట మొదటి రికార్డు సాధించగా.. లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టికి రెండో రికార్డు అందుకుంది. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్ పేరిట మూడో రికార్డును డ్రోన్ షో నెలకొల్పింది. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనతో నాలుగో రికార్డును సాధించింది. ఏరియల్…