నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన డామినెంట్ షోలో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్ అఖీల్ అలీఖాన్ సత్తా చాటాడు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ F4 రేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా అక్కినేని నాగ చైతన్య ఉన్నారు.
రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్టు, 2017-18, 2018-19, గత ప్రభుత్వ హయాంలో రిపోర్టులు, ఆలస్యం అవడానికి కారణాలను సభ ముందు మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.
బీజేపీకి ఝార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదు.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన జార్ఖండ్ రాష్ట్రం బొకారో నియోజకవర్గంలోని శివండి, దుంది బజార్, ఆజాద్ నగర్ తదితర బ్లాక్లల్లో ఇండియా కూటమి పక్షాన ప్రచారం నిర్వహించారు.
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు హాస్పటల్లో వాచ్మెన్ వైద్యుడి అవతారమెత్తాడు. వైద్యులు విధులకు హాజరుకాకపోవడంతో అక్కడి వాచ్మెన్, సిబ్బందే వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు మెడికల్ చెకప్‌లు చేస్తున్నారు. ఇంజెక్షన్లు చేస్తూ మందులు కూడా ఇస్తున్నారు.
తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారు.. అమాయకులను బలి చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అధికారులను విదేశాల్లో దాచారని మంత్రి కొండా సురేఖా అన్నారు. బీఆర్ఎస్ ది తుగ్లక్ పాలన.. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టిందని దుయ్యబట్టారు.
బీజేపీ చేపట్టిన 'మూసీ నిద్ర' కార్యక్రమంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని ఆరోపించారు.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
మహారాష్ట్ర బల్లార్పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తానన్నారు.