హైదరాబాద్‌లో మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమిచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. రసవత్తరంగ సాగిన ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది.
మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్లో పర్యటిస్తున్నారు. రియో డీజెనిరోలో జరిగిన జీ-20 సదస్సు నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. హోస్ట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా మోడీకి కరచాలనం చేసి, కౌగిలింతతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు చాలా సేపు మాట్లాడుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి చాలాసేపు మాట్లాడారు.
ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇప్పటికే గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించిన బ్యాగ్డ్ ఆర్గానిక్ బేబీ మరియు మొత్తం క్యారెటలను…
ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్‌కు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన బృందం దాడి చేసింది. ఎలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయ్యాడు. నివేదికల ప్రకారం.. అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ అధికారులు కొంతకాలం క్రితం అన్మోల్ తమ దేశంలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో.. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతని అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన వారాల తర్వాత కాలిఫోర్నియా పోలీసులు అన్మోల్ను అరెస్టు చేశారు.
రైళ్లు, రైల్వే ట్రాక్‌లపై పెరుగుతున్న ప్రమాదకరమైన స్టంట్లను అరికట్టడానికి రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లకు కఠినమైన ఆదేశాన్ని జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రకరకాల వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైళ్లలోనూ, రైల్వే ట్రాక్ లపై ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంలో.. రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు లోపల గానీ.. రైలు పట్టాలపై గానీ రీల్స్ చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు అన్ని జోన్లకు రైల్వే…
ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024లను శాసనసభ ఆమోదించింది.
మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో అతను మెగా వేలంలో ఉండనున్నాడు. అయితే.. ఈసారి స్టార్క్ రికార్డు వేలం కొల్లగొట్టకపోవచ్చునని.. ఇంతకుముందు మెగా వేలంలో స్టార్క్ రికార్డును బద్దలు కొట్టగల ఓ భారతీయ ఆటగాడు ఉన్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
ఆ ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు.. కిషన్ రెడ్డి ఫైర్.. సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 35 లక్షల సభ్యత్వం తెలంగాణలో పూర్తి అయిందన్నారు. ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి…
గాలి కాలుష్యం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోనే కాకుండా.. పాకిస్తాన్లో కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్డౌన్ విధించారు. తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్‌లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్డౌన్ విధించిందని పాక్ మీడియా…