రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు చకచకా జరిగిపోతుందన్నారు.
అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాతగా.. గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "కేరాఫ్ రవీంద్రభారతి". జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన, మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో చేస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతిలో జరిగాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కీలక అప్డేట్స్ వస్తున్నాయి. జనవరిలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ఐసీసీ ప్రకటించింది. ఈ ట్రోఫీకి హోస్టింగ్‌తో సంబంధం లేదు.. పెద్ద టోర్నమెంట్లకు ముందు ఐసీసీ ఈ ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ నుంచి భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
Wedding Card : హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతుండగా..
తెలుగు భాషను కాపాడుకుందాం.. మన సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతాం అంటూ సదస్సులో…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
కలబంద వాడకం చర్మానికి ప్రయోజనకరంగా చెబుతారు. కలబంద మన ఇంటి పరిసరాల్లో దొరుకుతుంది. కలబంద వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నయం చేసే గుణం దీనిలో ఉంది. కలబంద ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పని చేస్తుంది.
ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు సాధించాడు. కాగా.. ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ మ్యాచ్‌లో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందున్న విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
ఉగ్రవాదులు భారత్‌ను భయ పెట్టలేరు.. ఎందుకంటే.. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు. ఉగ్రవాదులు తమ ఇళ్లలో కూడా సురక్షితంగా ఉండలేకపోతున్నారన్నారు. భయం భయంగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోడీ అన్నారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై కూలంకషంగా చర్చించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను వీక్షించిన ఆయన ఆ ఘటనపై స్పందించారు. ‘‘ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన…