Kishan Reddy : రవీందర్ ఆత్మహత్య ఘటనకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నం పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గత 17 ఏండ్లుగా హోంగార్డ్ గా పనిచేస్తున్న రవీందర్ (35) ఆత్మహత్యాయత్నం ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాననన్నారు. అసెంబ్లీ సాక్షిగా 2017లో స్వయంగా సీఎం కేసీఆర్ హోంగార్డ్స్ ను పర్మినెంట్ చేస్తా అని మాట ఇచ్చి తప్పారు. వాళ్ల గోడు చెప్పుకుందాం అంటే ఆయన దొరకరని, గత 2 నెలలుగా మంత్రుల ఇండ్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం, జీతం సరిగా రాకపోవడం పైగా అవమానాలు, చీత్కారాలతో విసిగిపోతున్న హోంగార్డులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Sundar Pichai: గూగుల్‌కు 25 ఏళ్లు.. ఉద్యోగులను ఉద్దేశించి సీఈవో బ్లాగ్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
16 వేల మంది హోంగార్డ్స్ కు కేవలం రూ.27వేల జీతం ఇస్తున్నారు. ఏదైనా కారణంతో ఒక్క రోజు విధులకు హాజరు కాకపోతే తొమ్మిదివందల రూపాయలు కట్ చేస్తున్నారు. అంటే హోంగార్డులను రోజూవారీ కూలీలుగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సంవత్సరానికి వందరోజుల అలవెన్స్ కింద 20 వేలు, యూనిఫాం అలవెన్స్ కూడా ఇస్తా అని ఇవ్వడం లేదు. 40 ఏండ్లు పని చేసిన వారికి సైతం రిటైర్మెంట్ అయితే శాలువా కప్పి బోకే ఇచ్చి పంపిస్తున్నారు. కానీ హోంగార్డులు డిమాండ్ చేస్తున్నట్లుగా రూ.10లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం లేదు. ఉన్నన్ని రోజులు వారి సేవలను వినియోగించుకుని ఆ తర్వాత రోడ్డున వదిలేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
Also Read : Asia Cup 2023: సూపర్-4లో.. బంగ్లాదేశ్పై పాకిస్తాన్ ఘన విజయం
అంతేకాకుండా.. ‘విధి నిర్వహణలో చనిపోతే ప్రమాదబీమా, కారుణ్య నియామకాలు చేపట్టాలన్న హోంగాంర్డుల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్యోగభద్రత, హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలని, అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో తాను హోంగార్డుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయడం, వారి హక్కుల కోసం పోరాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్ని సమస్యలున్నా ఆత్మహత్య పరిష్కారం కాదని, హోంగార్డులు అధైర్య పడొద్దని కిషన్ రెడ్డి అన్నారు. హోంగార్డ్స్ కి బీజేపీ మద్దతు ఉంటుందని భరోసా ఇస్తున్నాను.’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!