ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు తరలించడంపై రాష్ట్రంలో టీడీపీ భగ్గమంటోంది. చంద్రబాబు అరెస్ట్నకు నిరసన టీడీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారు జాము నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో క్యాంప్ కార్యాలయాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, ponguleti srinvias reddy, bjp, brs
చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు తెలిపింది. తగిన భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న ఆయన న్యాయవాదుల విజ్ఞప్తికి ఏసీబీ కోర్టు సమ్మతి తెలిపింది.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి, రిచెస్ట్ సీఎం.. కానీ ఏమి పని చేశాడో తెలియదని విమర్శించారు. హఠాత్తుగా ఆస్తులు పెంచేసుకుని, అక్రమంగా డబ్బులు సంపాదించిన వారంతా రాజ్యాధికారం దక్కించుకున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన అంశంలో తన మద్దతు ఉంటుందని చెప్పారు.