రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. అందుబాటులో యూరియా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. యూరియాతో పాటు అన్ని ఎరువులు సరిపడినన్ని ఉన్నాయని, రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదన్నారు నిరంజన్ రెడ్డి.
రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల మెట్రిక్ టన్నులు, కంపెనీ గోడౌన్లలో 6 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అందుబాటులో యూరియాతో పాటు మొత్తం 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు,
ఆయా జిల్లాల పంటలసాగు, పంటల పరిస్థితిని బట్టి ఎరువుల నిల్వ ఉన్నట్లు తెలిపారు. రాబోయే నాలుగు రోజులలో అందుబాటులోకి మరో 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా, రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందవద్దన్నారు నిరంజన్ రెడ్డి. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన వెల్లడించారు.
స్పిక్ కంపెనీ యూరియా 845 మెట్రిక్ టన్నులు వరంగల్ కు, క్రిభ్కో కంపెనీకి చెందిన 1,300 మెట్రిక్ టన్నుల ఎరువులు జగిత్యాలకు చేరుకున్నాయని తెలిపారు. క్రిభ్కో కంపెనీకి చెందిన 1,300 మెట్రిక్ టన్నులు తిమ్మాపూర్ కు, ఆర్సీఎఫ్ ఎరువులు 1,446 మెట్రిక్ టన్నులు అలాగే క్రిభ్కో కంపెనీకి చెందిన 1,300 మెట్రిక్ టన్నులు సనత్ నగర్ కు, ఆర్సీఎఫ్ కంపెనీ ఎరువులు 1,246 మెట్రిక్ టన్నులు జడ్చర్లకు సోమవారం చేరుకోనున్నాయని తెలిపారు. ఎన్.ఎఫ్.సీ.ఎల్ కంపెనీ ఎరువులు 1,316 మెట్రిక్ టన్నులు నిజామాబాద్ కు, 1,320 టన్నుల ఎరువులు కామారెడ్డికి ఆదివారమే చేరుకున్నాయని తెలిపారు. ఆర్సీఎఫ్ కంపెనీ ఎరువులు 2,600 మెట్రిక్ టన్నులు మిర్యాలగూడకు ఈ నెల 13న, పీపీఎల్ ఎరువులు 550 మెట్రిక్ టన్నులు ఖమ్మం జిల్లాకు, అదేవిధంగా అదే కంపెనీ ఎరువులు వరంగల్ జిల్లాకు 750 మెట్రిక్ టన్నులు, ఈనెల 14 లేదా 15 కు చేరుకుంటాయని తెలిపారు. ఎం.ఎఫ్.ఎల్ కంపెనీకి చెందిన 1,450 మెట్రిక్ టన్నుల ఎరువులు ఈ నెల 15న జడ్చర్ల రేక్ కు చేరుకుంటుందని మొత్తం 18,038 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ జిల్లాకు చేరుకుంటుందని వెల్లడించారు.