ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్ష చేపట్టారు. అనంతరం సీఆర్డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Pay By Car :ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలి అనుకున్న.. లేదా డబ్బులు డ్రా చెయ్యాలి అనుకున్న కచ్చితంగా బ్యాంక్ కి వెళ్లాల్సి వచ్చేది. ఇక బ్యాంక్ సెలవు రోజుల్లో అయితే ఎంత అవసరం ఉన్న ఏం చెయ్యలేని పరిస్థితి ఉండేది.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు అత్యవసర ఊరట దక్కలేదు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి 24 గంటల నిరాహార దీక్ష పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఇందిరా గాంధీపార్క్‌లోని ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా 24 గంటల దీక్ష ఏర్పాటు చేశారు. breaking news, latest news, telugu news, bjp, kishan reddy, big news,