ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. ఒక్కరిని కూడా అనేది ఎవ్వరూ కూడా నమ్మలేదు. ఇలా చేయాలని ఉంటే పైకి అనకుండా పొంగులేటి తన పని ఏదో చాపకింద నీరులా చేసుకుని పదికి పది కాకపోయినా కొంత వరకు అయినా సక్సెస్ అయ్యేది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథానికి తుమ్మల నాగేశ్వరరావు రూపంలో కొంత ఉపయోగపడుతుంది. తుమ్మల ధిక్కార స్వరం వినిపిస్తే మాత్రం పొంగులేటి కంటే బిఆర్ఎస్ కు తుమ్మల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. పొంగులేటి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని పొంగులేటి శపథం తుమ్మల రూపంలో నెరవేరనున్నది. రాష్ట్ర స్థాయి కమ్మ సంఘం లో తుమ్మల గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నారు.
Also Read : Assam Rains: ఈ ఏడాది 12 లక్షల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు
రాష్ట్రంలో సుమారు 20 లక్షల వరకు కమ్మ. సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్నది. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తుమ్మల ప్రభావితం చేయగల శక్తి ఉన్నది. పాలేరు లో కందాల ఉపేందర్ రెడ్డి కి టికెట్ ఇవ్వకపోతే ఆ ఒక్క నియోజకవర్గం లోనే ప్రభావం ఉంటుంది. అదే తుమ్మల కు టికెట్ ఇవ్వకపోతే అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, ఇల్లెందు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తీవ్రమైన వ్యతిరేక పవనాలు రావడం. ఖాయం. అంతే కాకుండా తుమ్మల రాష్ట్రంలో ఏదైనా చక్రం తిప్పి బిఆర్ఎస్ అధికారానికి దూరం చేసినా ఆశ్చర్యం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకులైన తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారినే ప్రక్కన పెట్టడం వెనుక ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఉన్న ధైర్యం ఏమిటన్నది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. మొదట పొంగులేటి ధిక్కార స్వరం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు నిత్యం ఆయన గురించే మీడియా ప్రచారం చేసింది.
Also Read : Off The Record: టీడీపీ-జనసేన పొత్తు.. బీజేపీకి మైండ్ బ్లాంక్ అయిందా..?
ఆ తర్వాత కెసిఆర్ ఎవరికి టికెట్లు ఇవ్వనున్నారో అనే ప్రచారం జరిగింది. టికెట్ల ప్రకటన తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తుమ్మలను పోటి సిద్దంగా చేస్తున్నారు..యే పార్టీ అనేది తెల్చకుండానే హైదరాబాదు నుండి ఖమ్మం కు వస్తున్న తుమ్మల కోసం భారీ కార్లతో ర్యాలీలతో తుమ్మల అభిమానులు అనుచర గణం ఖమ్మం చేరుకున్నారు..తుమ్మల ఎమ్ చెబుతారో అని అబిమానులు అనుచరులు ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి తుమ్మలను గెలిపించుకుంటా అని అనుచర గణం ముక్త కంఠంతో చెబుతున్నారు.