ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 21 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో 2 రోజులు పెంచే అవకాశం ఉంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మేయర్ పొట్లూరి స్రవంతి షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి దూరమైన తర్వాత మేయర్ స్రవంతి ఆయన వైపే నిలిచారు. ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో మేయర్ స్రవంతికి విభేదాలు తలెత్తాయి.
నేడు విధుల బహిష్కరణకు బెజవాడ బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. నందిగామలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా విధుల బహిష్కరణకు నందిగామ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు లాయర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అదే జిల్లాలో మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను ఇతరులకు చూపించకుండా ప్రైవేట్గా చూడటం చట్ట ప్రకారం నేరం కాదని అది వ్యక్తిగత ఇష్టమని కేరళ హైకోర్టు పేర్కొంది. దానిని నేరంగా పరిగణిస్తే వ్యక్తి గోప్యతకు భంగం వాటిల్లిందని.. అతని వ్యక్తిగత ఎంపికలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది.