అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను రూపొందించిందని, స్వదేశీయంగా నిర్మించిన అంతరిక్ష నౌకలో భారతీయుడు చంద్రునిపైకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.
డెంగ్యూ జ్వరం అంటే ఎంతో ప్రమాదకరమైనదో చెప్పనక్కర్లేదు. సీజన్ మారుతుందంటే ఇది తొందరగా విజృంభిస్తుంది. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూకు ఇంతవరకు నిర్ధిష్టమైన మందులు, చికిత్స విధానాలు లేవు. తాజాగా.. డెంగ్యూ వ్యాధికి తొలి ఔషధాన్ని 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ రూపొందించింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను క్రాస్ చేశాడు. ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. దీంతో సెంచరీల పరంగా ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ కంటే తాను చాలా ముందున్నానని వార్నర్ తన సెంచరీతో చాటాడు.
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. తెలంగాణలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.. breaking news, latest news, telugu news, big news, mlc kavitha, rahul gandhi
కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సమక్షంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరారు. మూడు రోజుల విజయవంతమైన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ఆర్మూర్ సభతో ముగిసింది. breaking news, latest news, telugu news, rekha naik
షాహీన్ వేసిన బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు కొంచెం తడబడ్డారు. అతను వేసిన అద్భుత బౌలింగ్‌తో 5 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాను ఒక్కో పరుగు కోసం కష్టపడేలా చేశాడు. షాహీన్ 5.40 ఎకానమీ రేటుతో 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్‌కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు.
ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.