MLC Kavitha : తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్‌ఎస్‌ది పేగు బంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. తెలంగాణలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్‌ఎస్‌ది పేగు బంధమన్నారు. ఇవాళ ఆమె నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆమె మాట్లాడుతూ.. పేగుబంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆధరిస్తారని, తెలంగాణను వెనుకబడేయడంలో ఆ పార్టీకి అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది నెహ్రూ అని, 1969 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై కాల్పులు జరిగింది ఇందిరా గాంధీ హాయంలో అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా భూకబ్జాలపై సీఐడీకి రిఫర్ చేయనున్న ఏపీ ప్రభుత్వం
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై ఇందిరా గాంధీ కాల్పులు జరిపిస్తే 369 మంది అమరులయ్యారని, తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కవిత మండిపడ్డారు. 2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లి కారణంగా వందలాది మంది అమరులయ్యారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. 2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లిన కారణంగా వందలాది మంది అమరులయ్యారన్నారు. కాంగ్రెస్ తన ద్రోహ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని రాహుల్ గాంధీకి హితవు పలికారు ఎమ్మెల్సీ కవిత.
Also Read : Janasena-TDP Meeting: టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారు
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!