మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహింహులు పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి హల్చల్ చేశారు. కేసీఆర్ ను సమర్థించి తప్పుచేశానన్నారు. దళితబంధు అమలు కాకుంటే తాను చస్తానని గతంలో చెప్పానని.. ఇప్పుడు దళితబంధు అమలు కావటం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. దళిత యువత తనకు మెసేజ్ లు చేసి తనను చనిపోమని అంటున్నారని పేర్కొన్నారు.
2023 Israel–Hamas war: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కారుచిచ్చు రగులుతుంది. ఇప్పటికే ఇరు దేశాలు విచక్షణ రహితంగా ఒకరి మీద ఒక్కరు విరుచుకు పడుతున్నారు. ఈ మారణహోమంలో వేలమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇలాంటి సమయంలో ఇతర దేశాలు మద్దతు ఇస్తూ యుద్ధంలో పాల్గొనడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త. వివరాలలోకి వెళ్తే.. ఓ అంతర్జాతీయ మీడియాతో ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త మరియు యురేషియా గ్రూప్…
ఐపీఎల్ అంటే క్రికెట్ లవర్స్‌కు పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే కరోనా సమయంలో భారత్‌లో ఐపీఎల్ నిర్వహించలేదు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా వేరే దేశాల్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇదొక చేదువార్తలా చెప్పవచ్చు. ఐపీఎల్ భారత్‌లో జరగకపోవడానికి గల కారణాలేంటంటే.. వచ్చే ఏడాదే భారత్‌లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయంలోనే ఎన్నికలు వస్తున్నాయి.
హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం టీమ్‌లో రెండు మార్పులు అవసరమని భజ్జీ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని తెలిపాడు. అంతేకాకుండా.. 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలని పేర్కొ్న్నాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్ పోవడంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పని చేయలేదు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
Alluri Sitharama Raju district: ఆధునిక యుగంలో అంతరిక్షాన్ని సందర్శించి వస్తున్న ఈ కాలంలో ఇంకా కొందరు మంత్రాలకు చింతకాయలు రాల్తాయని విశ్వసించడం చాల బాధాకరం. ఆరోగ్యం బాగాలేకపోయిన, వరుస మరణాలు సంభవిస్తున్నా ప్రజలు వైద్య సేవలను తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా అదేదో మంత్రగాళ్ళ పనని వైద్యం చేయించుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఓ గ్రామంలో వరుసగా మనుషులు మరణిస్తున్నారు. దీనితో ఆ ప్రాంతానికి వైద్య…
Mahabubabad: కాలం మారుతున్న.. కొందరి మూర్ఖత్వం మాత్రం మారడం లేదు. కొడుకు పుడితే ప్లస్సు, కూతురు పుడితే మైనెస్ అనే లెక్కల్లో ఉన్నారు. ఇంటి పేరు కొడుకు వల్లే నిలబడుతుందని. కూతురు వంశాన్ని పెంచలేదనే భ్రమలో బ్రతుకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలను చేపట్టినా కొందరి మనుషుల మనస్తత్వాన్ని మార్చలేకపోతుంది. నవమాసాలు మోసి ప్రాణాలను పణంగా పెట్టి కన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే చాలు కనికరంలేకుండా చంపేసాతున్నారు. లేదా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే…
Viral News: ఐదోతనానికి మించిన ఆస్తి లేదు అంటారు మన పెద్దలు. అష్టయిశ్వర్యాలను ఓ వైపు భర్తను మరో వైపు ఉంచి నీకు ఏది కావాలో తీసుకోమంటే స్త్రీ భర్తనే కోరుకుంటుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. పైసలుంటే చాలు భర్తతో పనేది అందులోనూ తిరుగుబోతు భర్త నాకెందుకు అనుకుంటున్నారు కొందరు మహిళలు. ప్రతి కథ ఓ జీవితమే అన్నట్టు శుభలగ్నం సినిమాని నిజం చేసింది ఓ మహిళ. 5 లక్షల రూపాయలకు…
Israeli: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగడం లేదు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. ఇజ్రాయిల్ ప్రజల ఆర్తనాదాలు హమాస్ చెవికి వినపడలేదు. హమాస్ జరిపిన అతిక్రూరమైన దాడుల్లో 1400 మందికి పైగా మరణించారు. అలానే 200 మందిని బంధించింది హమాస్.. వాళ్లలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. అయితే నిన్న శుక్రవారం హమాస్ ఆ ఇద్దరు అమెరికన్లను విడిచిపెట్టింది. ఈ నేపథ్యంలో విజయం పొందే వరకు పోరాడతామని ఇజ్రాయిల్…
Israel-Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఇరు దేశాలలో ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అక్టోబరు 7న హమాస్ చిన్నపెద్ద తేడా లేకుండా విచక్షణ రహితంగా ఇజ్రాయిల్ పైన విరుచుకుపడింది. హమాస్ హింసాత్మక దాడుల్లో 1400 మంది పైగా చనిపోయారు. 200 మందిని అపహరించి తన అధీనంలో బంధించింది. హమాస్ ఉగ్రవాదులు అపహరించి బంధించిన 200 మందిలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా…