NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ..
- ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కొంతమంది విద్యార్థుల అభ్యంతరం..
- విద్యార్థులకు షాక్ ఇచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా..
- అడ్వొకేట్ ఎన్రోల్మెంట్ తాత్కాలిక నిలిపివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NALSAR row: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) మరోసారి వార్తల్లో నిలిచింది. 2026లో న్యాయ విద్య పూర్తి చేసిన విద్యార్థులను అడ్వొకేట్లుగా ఎన్రోల్ చేయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తాత్కాలికంగా నిలిపివేసిన ఆదేశాలపై వ్యతిరేకత రావడంతో చివరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బార్ కౌన్సిల్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
బార్ కౌన్సిల్ మొదటి ఆదేశాలు జారీ అయిన గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుంది. కొత్త ఆదేశాల్లో విద్యార్థులపై ఎలాంటి చర్య తీసుకోబోమని BCI స్పష్టం చేసింది.విద్యార్థుల ఎన్రోల్మెంట్పై విధించిన ఆంక్షలను తొలగించింది. కొందరు టీచర్లు, బయటి వ్యక్తులు విద్యార్థుల్ని రెచ్చగొట్టారని బార్ కౌన్సిల్ ఆరోపించింది. విద్యార్థులు అమాయకులని పేర్కొంది. మరోవైపు, మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ బీసీఐ తొలి నిర్ణయాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల భావప్రకటనా స్వేచ్చను పరిమితం చేసే అధికారం లేదని అన్నారు.
Also Read
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో 2026లో NALSAR నుంచి లా డిగ్రీ పొందిన ఏ విద్యార్థినీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేయరాదని BCI స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే తన నిర్ణయంపై వెనక్కి తగ్గింది.
నల్సార్ వైస్‌ఛాన్సలర్ నుంచి నివేదిక కోరిన BCI..
కాన్వొకేషన్‌కు సంబంధించిన వివాదంపై నల్సార్ వైస్ ఛాన్సలర్ నుంచి BCI నివేదిక కోరింది. BCI ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అడ్వొకేట్ వీపీ శర్మ, కమిటీ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల విషయంలో క్రమశిక్షణ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి యూనివర్సిటీ నుంచి మాత్రమే నివేదిక కోరామని, విచారణలో క్రమశిక్షణ ఉల్లంఘించలేదని తేలితే ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగిస్తామని తెలిపారు. బీసీఐ నిర్ణయాన్ని సవాల్ చేయాలనుకునే వారికి ఆ అవకాశం కూడా ఉందని తెలిపారు.
CJI సూర్యకాంత్ ఆహ్వానాన్ని వ్యతిరేకించిన 450 మంది విద్యార్థులు:
నల్సార్ 2026 బ్యాచ్‌కు చెందిన 450 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లు, ఇతర అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. 2026 కాన్వొకేషన్‌కు CJI జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు కోరారు. యువతను బొద్దింకలుగా పోల్చడాన్ని, జంతర్ మంతర్ నిరసలన సమయంలో పోలీసులు చర్యలు చూసేందుకు సమయం లేదని చెప్పడంపై సీజేఐ తీరును తప్పుబడుతున్నారు.
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!