Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే సినీ అభిమానులకు పండగే. గతంలో ఈ స్టార్లు కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫిస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే. నిజానికి రవితేజ, సునీల్ మధ్య స్నేహం సినిమాలకు పరిమితం అయినది కాదు.. ఈ రోజు నిర్వహించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా సక్సెస్ మీట్‌లో మాస్ మహారాజా రవితేజ సునీల్‌తో తన స్నేహం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: Indian Woman: పాకిస్తాన్ వెళ్లి, మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు అనుభవిస్తోంది..
ఈ సందర్భంగా మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “నాది, సునీల్ ది విపరీతమైన వెటకారంతో కూడిన ఫ్రెండ్ షిప్… మా మదర్, సునీల్ వాళ్ల మదర్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల వెటకారాలే మాకు వచ్చినట్లు ఉన్నాయి ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘దసరా’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత మాస్ మహారాజాకు ఈ చిత్రంతో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Reservations: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..