Visakhapatnam: కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదం పైన విచారణ ప్రారంభమైంది. కాగా విశాఖ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో మొదటగా డివిజన్ పరిధిలోని లోకో పైలట్లు, వివిధ డిపార్ట్మెంట్ ల సిబ్బంది హాజరు అయ్యారు. విచారణ సమయంలో లోకో పైలట్లు వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యల గురించి విచారణ అధికారులకు విన్నవించుకున్నారు. ఆటో సిగ్నల్ వ్యవస్థ పనితీరు, లోకో పైలట్లు ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి విచారణ అధికారులు…
Maharashtra: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమమం రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. ఇప్పటికే ఉద్యమం లో పాల్గొన్న చాలామంది ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఈ రోజు మరో నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాలపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మరాఠా కమ్యూనిటీకి OBC రిజర్వేషన్లు ఇవ్వాలంటూ జరుగుతున్న ఉద్యమానికి.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగేకి మద్దతు తెలుపుతూ 26 ఏళ్ల యువకుడు రంజిత్ మంజరే విషం తాగాడు. ఈ…
అజాగ్రత్త వల్లనో, అతివేగం వల్లనో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ రోజుకు కాదు గంటకి పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో గంటకి ఎంతమంది చని పోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2021 సంవత్సరం కంటే 2022 సంవత్సరంలో 11.9% ప్రమాదాలు, 9.4% మరణాలు, 15.3% క్షతగాత్రుల…
Israel-Hamas war: ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యన జరుగుతున్న యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు యుద్దాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. యుద్దాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గాజాలో కొనసాగుతున్న దాడులను విరమించుకోము అని తెలిపారు. అలా చేస్తే హమాస్‌కు లొంగిపోయినట్టే అవుతుందని అన్నారు. కాల్పుల విరమణకు పిలుపునివ్వడం అంటే ఉగ్రవాదానికి, అనాగరికతకు లొంగిపోవడమేనని..…
ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడు, breaking news, latest news, telugu news, big news, Pochampally Srinivas Reddy, congress
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దాలన్న తన సంకల్పాన్ని పునరుద్ఘాటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశాన్ని మహిమాన్వితంగా తీర్చిదిద్దుతామని ఈ గడ్డపై ప్రమాణం చేస్తున్నానన్నారు. అంతకు ముందు దేశ నేలకు నమస్కరించి.. ప్రపంచంలోని గొప్ప నాగరికతలు అంతరించిపోయాయని, అయితే ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఈ జాతిని కాపాడిన చైతన్యం భారత నేలకు ఉందన్నారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలి ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్.. 5వ స్థానానికి ఎగబాకింది. పాక్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలువగా.. నాలుగింటిలో ఓడిపోయింది. అయితే.. ఈ విక్టరీ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన స్పందనను తెలిపాడు. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లలో తమ జట్టు వ్యూహం గురించి చెప్పాడు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. అంటే బ్యాంకులకు 15 రోజులు సెలవులే ఉన్నాయి.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఈజీ విక్టరీ పొందింది. పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పాకిస్తాన్ ఈ విజయం తర్వాత.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై ఢిల్లీ సహా ఎన్సీఆర్లోని ఐదు రాష్ట్రాల నుంచి అఫిడవిట్లను కోర్టు కోరింది.