జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఓ పోలీసును ఉగ్రవాదులు అతని ఇంటిలోనే కాల్చిచంపారు. లోయలో గత మూడు రోజుల్లో ఇది మూడో లక్షిత దాడి కావడం గమనార్హం. బారాముల్లాలోని కరల్‌పోరా గ్రామంలోని కానిస్టేబుల్ గులాం మహ్మద్ దార్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుండాలను, రౌడీలను ప్రోత్సహించి breaking news, latest news, telugu news, big news, vinay bhaskar, congress, brs
ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. బ్యాంకుల్లో అట్రిషన్ రేటును ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ నిరంతరం గాజాపై బాంబు దాడులు చేస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ నగరంలోని అరూరాలోని సీనియర్ హమాస్ అగ్రనాయకుడు సలేహ్ అల్-అరౌరీ ఇంటిని కూల్చివేసింది. . ఈ నాయకుడి పేరు సలేహ్ అల్-అరూరి. అతను హమాస్ పొలిటికల్ బ్యూరో డిప్యూటీ చీఫ్, వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ మిలిటరీ కమాండ్ నాయకుడు.
వింటర్ సీజన్లో వెల్లుల్లి తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. అందులో అనేక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడడంలో, నివారించడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా.. అనేక వ్యాధులను నివారిస్తుంది. వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థి కుటుంబ సభ్యులు ట్యూషన్‌కు పంపించారు. ఇలా టీచర్ దగ్గర ట్యూషన్‌కు వెళ్తున్న 17 ఏళ్ల బాలుడిని ట్యూషన్ టీచర్ ప్రియుడు హతమార్చిన ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా టీచర్ ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బంగ్లాదేశ్-పాకిస్తాన్ మ్యాచ్ లో కొందరు అభిమానులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. స్టాండ్ లో కొందరు ప్రేక్షకులు పాలస్తీనా జెండాలతో కనిపించారు. పాలస్తీనా జెండాలతో స్టాండ్స్‌లో ప్రేక్షకులు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాలస్తీనాకు ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది.