అజాగ్రత్త వల్లనో, అతివేగం వల్లనో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ రోజుకు కాదు గంటకి పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో గంటకి ఎంతమంది చని పోతున్నారో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో 2021 సంవత్సరం కంటే 2022 సంవత్సరంలో 11.9% ప్రమాదాలు, 9.4% మరణాలు, 15.3% క్షతగాత్రుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గంటకు 53 ప్రమాదాలు జరుగగా.. 19 మంది మరణిస్తున్నారు. అలానే ప్రమాదాల పరంగా, మరణాల పరంగా ముందు వరసలో ఉన్న 10 రాష్ట్రాల పేర్లను నివేదికలో పేర్కొంది.
Read also:Indian Racing League: హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు.. కారణం ఇదే..
ఇందులో ప్రమాదాల పరంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తొలి పది స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాగా మరణాల పరంగా చూస్తే ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు మొదటి పదిస్థానాల్లో నిలిచాయి. అయితే గతంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7 వ స్థానంలోను తెలంగాణా 9 వ స్థానంలో ఉండేది. కానీ తాజాగా విడుదలైన ప్రమాదాల జాబితాల నివేదికలో ఆంధ్రప్రదేశ్ స్థానం 7 నుండి 8కి చేరింది. కాగా తెలంగాణా స్థానం 9 నుండి 10కి చేరింది. కాగా ఎక్కువగా ప్రమాదాలు గ్రామాలల్లో జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అలానే గుంతలు మిట్టలు ఉన్న రోడ్లకన్న బాగున్న రోడ్ల పైనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది.