45 రోజుల పాటు భారత్లో వరల్డ్ కప్ ఫీవర్ నడిచింది. తాజాగా ఆదివారం ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 పూర్తయింది. అయితే ఈసారి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటారని అనుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా చేతిలో చూడాలంటే ఇంకో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. వన్డే క్రికెట్లో తదుపరి ప్రపంచకప్ 2027లో జరగనుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను, కెసిఆర్ ఆశీర్వదిస్తే మంత్రిని అయ్యానన్నారు. తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గం breaking news, latest news, telugu news, big news, minister ktr, telangana elections 2023
భారత స్టార్ క్యూ ప్లేయర్ పంకజ్ అద్వానీ చరిత్ర సృష్టించాడు. ఈరోజు(మంగళవారం) జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 1000-416 పాయింట్ల తేడాతో సౌరవ్ కొఠారీని ఓడించి.. 26వ సారి టైటిల్ను గెలుచుకున్నాడు.
'క్రానిక్ అబ్జెక్టివ్ పల్మొనరీ డిసీజ్' (సిఓపిడి) అనేది తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఈ సమస్య ఉన్నవారిలో ఊపిరితిత్తుల నుంచి గాలి గుండెకు చేరటానికి అవరోధం కలగటంనుంచి ఊపిరితిత్తులలో ఉండే సన్నపాటి వాయుగోళాలు నశించిపోవటం లేదా దెబ్బతినటం, రక్తనాళాలు దెబ్బతినటం వంటి అనేక ఇబ్బందులు ఇమిడి ఉండవచ్చు. కాలక్రమేణా ఊపిరితిత్తులు పాడయినకొద్దీ, గాలి పీల్చుకోవటం బహుకష్టమవుతుంది.
ఓ మహిళ తన నోటిలో ఉండే పళ్లతో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. మాములుగా అయితే మన నోటిలో 32 పళ్లు ఉంటాయి. కానీ ఈ మహిళకు 38 పళ్లు ఉన్నాయి. దీంతో కల్పనా బాలన్ అనే ఇండియాకు చెందిన 26 ఏళ్ల మహిళ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.
కింగ్ కోబ్రా అంటే భయపడని వ్యక్తులు ఎవరు ఉండరు. ఆ పాము ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. అలాంటిది దాన్ని చూస్తేనే భయంతో వణికిపోయే మనం.. ఓ వ్యక్తి దాని దగ్గరికి వెళ్ళి గుండె ఆగిపోయేంత పనిచేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.