కింగ్ కోబ్రా అంటే భయపడని వ్యక్తులు ఎవరు ఉండరు. ఆ పాము ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. అలాంటిది దాన్ని చూస్తేనే భయంతో వణికిపోయే మనం.. ఓ వ్యక్తి దాని దగ్గరికి వెళ్ళి గుండె ఆగిపోయేంత పనిచేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Heart Attack: AIతో గుండెపోటును పదేళ్ల ముందే గుర్తించవచ్చు.. ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో వెల్లడి..
ఇంతకు ఆ వీడియోలో ఓ నాగుపాము పడగ విప్పి ఉంది. అయితే మెల్లగా దాని దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి ఆ పాము నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు. అలా ముద్దుపెడుతున్న క్రమంలో ఆ పాము కూడా అతనిని ఏం అనలేదు. దానికి కూడా అతను పెట్టే ముద్దు నచ్చిందేమో.. ముద్దు పెడుతుంటే, హ్యాపీగా చూస్తుంది ఆ నాగుపాము. ఒకవేళ తిరగబడి తనపై దాడి చేస్తున్నాడన్న భయంతో అతనిని కాటువేస్తే ఇంకేముంది. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఏదేమైనప్పటికీ ఈ సాహసం చేయడం చాలా ప్రమాదకరమే. ఇలాంటి వీడియోలు చూసి మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిదికాదు.
Read Also: ICC: దక్షిణాఫిక్రాలో అండర్-19 వరల్డ్ కప్.. శ్రీలంక నుంచి షిఫ్ట్
ఈ వీడియోను స్నేక్ లవర్ నరసింహా అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను రెండు మిలియన్లకు పైగా మంది చూశారు. అంతేకాకుండా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సాహసం మరేప్పుడు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా.. మరో వినియోగదారు ‘చాలా ప్రమాదకరమైన స్టంట్.’ అని రాసుకొచ్చాడు. మరొక వినియోగదారు, ‘మృత్యువును ఆలింగనం చేసుకున్న వీడియో’ అని రాశారు. అదే సమయంలో.. ఒక వినియోగదారు, ‘నేను ఒక క్షణం భయపడ్డాను’ అని కామెంట్ చేశాడు.