హమాస్, ఇజ్రాయిల్ మధ్య అక్టోబర్ 7వ తేదీన మోగిన యుద్ధ బేరి నేటితో ముగుస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఇజ్రాయిల్ హమాస్ తో స్వాప్ డీల్ కుదుర్చుకుంది.
వందేభారత్ రసౌలీ స్టేషన్ సమీపం లోకి రాగానే కదులుతున్న రైలుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. రాళ్లు విసరడం వల్ల రైలు లోని సి6 కోచ్ లోని అద్దం పగిలిపోయింది.
విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు(నవంబర్ 24) ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే పేరు గుర్తు ఉందా అని గ్రామాల్లో అడిగితే ఒక్కసారి కూడా కనపడలేదు అని అంటున్నారన్నారు. 14 ఏళ్లుగా గెలిచిన కేటీఆర్ కు సిరిసిల్లలో సొంత ఇల్లు…
ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ వాతావరణం బాగుండాలి.. ఖమ్మంలో ఆ పరిస్థితి లేదని, తాను మంత్రివర్గం నుంచి తప్పుకున్నాక పరిస్థితులు మారాయని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో ఎన్టీవీ క్వశ్చన్ అవర్లో పాల్గొన్నారు.
విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు.
ప్రేమ పేరుతో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఓ హిందీ టీచర్ మోసం చేశాడు. అంతేకాదు.. ఆ బాలికను కిడ్నాప్ చేసి, తాళి కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో చోటు చేసుకుంది.
దేశానికి దిక్సూచిలా తెలంగాణ పాలన, పథకాలు ఉన్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ సాధించిన విజయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల వారు తెలంగాణ అభివృద్ది చూసి ఆశ్చర్యపోతున్నారని.. పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అడుగుతున్నారన్నారు.