తెలంగాణ రాష్ట్రంలో ఎందుకో కొత్త జబ్బు వచ్చిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కంటి చూపు జబ్బు వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.
సికింద్రాబాద్ ప్రాంతంలోని రామ్‌గోపాల్‌పేట్‌లో ఉన్న డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్టు సర్క్యూ్ట్ కారణంగా మంటలు చెలరేగాయి.
Bandi Sanjay: పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. యాదాద్రి జిల్లా పొడిచెడు గ్రామం వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయంపై ఎన్టీవీతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు ఎంత తీసుకున్నారని ప్రశ్నల…
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్ చేరుకున్న ఆయన వరుస మీటింగ్ లతో ఆయన బిజీగా గడపనున్నారు. ముందుగా చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం కానున్నారు. ఆగస్టు 21న జరగనున్న బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న నేతల లిస్టుపై చర్చించనున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎంత మంది నాయకులను సంప్రదించారు, పార్టీలో చేరేందుకు ఎవరెవరు సంసిద్ధత వ్యక్తం చేశారన్న అంశాలను చేరికల కమిటీ సభ్యులు చుగ్ కు వివరణ…
ఈడీ సమన్లపై చికోటి ప్రవీణ్ స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. సోదాల్లో అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానని పేర్కొన్నారు. రేపు ఈడీకి సమాధానం బెబుతా అంటూ మీడియాకు తెలిపారు. అధికారులకు సందేహాలు ఉన్నాయి, అందుకే వివరణ అడిగారని ప్రవీన్ అన్నారు. గోవా, నేపాల్ క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించామని ప్రవీణ్ స్పష్టం చేసారు. అయితే.. ఈడీ విచారణలో…
క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్ ఉండటం సంచలనంగా మారింది. దీంతో.. మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ స్టిక్కర్ నాదే కానీ.. దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. నగరంలోని బోడుప్పల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన అనంతరం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే.. మాధవ రెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్ తనదేనన్న మల్లారెడ్డి, అది 2022 మార్చి నాటిదని చెప్పారు. ఈనేపథ్యంలో..…
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు నిలదీస్తారనే సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడంలేదని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే.. కేంద్రమే అన్నీ చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకని రాజాసింగ్ సీఎంను ప్రశ్నించారు.…
గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. CM KCR will visit flooded areas tomorrow K.Chandrashekar Rao, KCR Visi Flooded Areas, Breaking News, Telugu Latest News, Heavy Rains In Telangana, Telangana Floods,
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తెల్లవారు జామునే కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో…