ఈడీ సమన్లపై చికోటి ప్రవీణ్ స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. క్యాసినో వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తోందని స్పష్టం చేశారు. ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. సోదాల్లో అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానని పేర్కొన్నారు. రేపు ఈడీకి సమాధానం బెబుతా అంటూ మీడియాకు తెలిపారు. అధికారులకు సందేహాలు ఉన్నాయి, అందుకే వివరణ అడిగారని ప్రవీన్ అన్నారు. గోవా, నేపాల్ క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించామని ప్రవీణ్ స్పష్టం చేసారు. అయితే.. ఈడీ విచారణలో నేపాల్ క్యాసినో ఈవెంట్ లో టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన 10 మంది ప్రముఖులు పాల్గొన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. వారితోనే ప్రమోషన్ వీడియోలు కూడా చేయించినట్లు , సినీ సెలబ్రిటీలతో జరిగిన ఆర్థిక లావాదేవీలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
read also: CPI Narayana: 5 గ్రామాలు తెలంగాణలో కలపడానికి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి..!
చికోడి చిట్టా:
ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబి ఛైర్మన్లు వున్నట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన మంత్రితో పాటు, ఏపీ మాజీ మంత్రితో లింకులు వున్నట్లు సమాచారం. నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు వున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్‌లో VIPల భాగోతాలు వున్నట్లు , చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా చికోటి లింక్ లు వున్నట్లు పోలీసుల తేల్చారు. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌లో అడ్డాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్లు వున్నట్లు, ఒక్కో ప్రైవేట్ విమానానికి 50లక్షలు చెల్లింపు వున్నట్లు గుర్తించారు. ఒక్కో హోటల్‌కు 40లక్షలు చెల్లించినట్లు సమాచారం. కస్టమర్ల నుంచి 5లక్షలు వసూలు చేసినట్లు , ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు 200 మంది వున్నట్లు పోలీసులు గుర్తించారు.
read also: Snake In Train: రైలులో పాము.. చివరకు ఏం జరిగిందంటే…
అయితే.. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి ఇళల్లో తెల్లవారుజామున వరకు ఈడి సోదాలు నిర్వహించారు. సుమారు 20 గంటల పాటు సోదాలు నిర్వహించింది. తెలంగాణ లో సైదాబాద్, బోయిన్ పల్లీ, కడ్తల్ లో ఈడి సోదాలు చేపట్టింది. ప్రవీణ్ చికొటి ఇంటి నుండి మొబైల్స్, లాప్ టాప్ లను సీజ్ చేసారు అధికారులు. నేపాల్ లో లీగల్ గా క్యాసినో నిర్వహించినట్టు ప్రవీణ్ తెలిపాడు. లాప్ టాప్ లో లభించిన పలు అనుమానాస్పద లావాదేవీలపై ఆరా చేపట్టింది. పంటర్స్ తో జరిపిన పలు లావాదేవీల పై చికోటి నుండి వివరాలు తీసుకున్న ఈడి, హవాలా రూపంలో చెల్లింపులు పై లోతు గా దర్యాప్తు ముమ్మరం చేసింది. నేపాల్ , ఇండోనేషియా, పుక్కెట్ లో క్యాసినోలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. క్యాసినో లలో టాలివుడ్ , బాలీవుడ్ , నేపాలీ డ్యాన్సర్ల చిందులు వేసారు. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడీ.. దాడులు చేస్తోంది. గతంలో బర్త్ డే పేరుతో ఖరీదైన పార్టీలు ఇచ్చిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
CPI Narayana: 5 గ్రామాలు తెలంగాణలో కలపడానికి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి..!