హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భోలక్‌పూర్‌లోని స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. జనావాసాల మధ్య గోడౌన్ ఉండడంతో.. ఆందోళన నెలకొంది. మంటలు పెద్ద ఎత్తున్న ఎగిసి పడుతున్నాయి. గోడౌన్ చిన్న గల్లీలో ఉండడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్‌లు వెళ్లేందుకు చోటు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రమాద స్థలానికి 3 ఫైర్ ఇంజన్‌లను అధికారులు పంపారు. మంటలు ఎగిసిపడుతుండడంతో.. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే..…
ఈ సారి పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో పదో తరగతి పరీక్షలు ఆస్పష్టతగా కొనసాగాయి. కరోనా ప్రభావంతో మొదటిసారి పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో బెంచీకొకరు చొప్పున విద్యార్థులను ‘7’ ఆకారంలో కూర్చోబెట్టే విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే మే 23 నుంచి 28 వరకు పరీక్షలు జరుగనున్నాయి. అయితే ప్రతి ఏటా…
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అమ్మ రాజశేఖర్ మరోసారి వెండితెరపైకి ఆర్టిస్ట్ గా వస్తున్నాడు. అతనితో పాటు కట్ల ఇమ్మార్టెల్, అలీషా, షాలినీ ప్రధాన తారాగణంగా ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్) అనే సినిమా గురువారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రాన్ని కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి రాజశేఖర్, జీవిత, యస్.వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రామ సత్యనారాయణ, సాయివెంకట్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.…
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కుంభంపాటి రాంమోహన్ రావును మంచి పదవిలో చూస్తామన్నారు. అనంతరం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల కష్టాలను పార్లమెంటులో ప్రస్తావించారన్నారు. ప్రతీ ఒక్కరికి తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా ఉండేలా చేసింది రాంమోహన్ అని, రాంమోహన్ కు…