K.Chandrashekar Rao Will Visit Flooded Areas Tomorrow in Telangana.
గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లు తుండటం, చెరువులు నిండి వరద నీరు గ్రామాల్లోకి రావడంతో ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు అధికారులు. అంతేకాకుండా వరదతో రైతులు తీవ్ర నష్టపోయారు. వరద నీరు పంటపొలాలపై దండయాత్ర చేయడంతో పత్తి, వరి పంటల రైతులు తీవ్ర నష్టం చవిచూసారు. అయితే రైతన్నలు అదుకోవాలని కోరుతున్నారు. జలాశయాలకు సైతం వరద నీరు పోటెత్తడంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్, భద్రాద్రిలో గోదావరి ఉప్పొంగి ప్రవహించింది.
దీంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించారు. అయితే గత రెండు రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. అంతేకాకుండా భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు.ఈ క్రమంలోనే రేపు వరద బాధితుల్ని సీఎం కేసీఆర్ కలువనున్నారు. ఏరియల్ సర్వేతో పాటు ముంపు ప్రాంతాలకు కేసీఆర్ వెళ్లనున్నారు. ప్రజలను కలిసి కష్టాలను సీఎం కేసీఆర్ తెలుసుకోనున్నారు. అంతేకాక.. వరద బాధితులకు సీఎం కేసీఆర్ సహాయం ప్రకటించనున్నారు.