Telugu Film Writer Keerthi Sagar Suspicious Death: మనకు తెలియని కొత్త ప్రపంచాలను పరిచయం చేయడంతో పాటు ఎన్నో పాత్రలకు ప్రాణం పోసే ఓ రచయిత విషాద గాధ ఇది. సినిమాల మీద మక్కువతో ఆ రైటర్ ఎన్నో కథలను రాశాడు. మరెన్నో పాత్రలను సృష్టించిన ఆయన.. వెండితెరపై వాటిని చూసి మురిసిపోవాలని అనుకున్నాడు. రచయితగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని కలలు కన్నాడు. కానీ.. తన కల నెరవేరకుండానే ఆయన కన్నుమూశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Gun Firing: పాతబస్తీలో గన్ ఫైరింగ్.. సివిల్ వివాదంలో ఇరువర్గాల మధ్య గొడవ
సినిమాల మీద కథలు రాయాలన్న మక్కువతో.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తి సాగర్ (50) చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. షేక్‌పేట్ పరిధిలోని ఓ పెంట్‌హౌస్‌లో.. తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. వందలాది సినిమా కథలు రాసిన సాగర్.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. అలాగే.. సహాయ దర్శకుడిగా ఆఫర్లు కోసం కూడా ట్రై చేశాడు. ఒక్క ఛాన్స్ అంటూ.. ఆయన తిరగని సినిమా ఆఫీసంటూ ఏదీ లేదు. అయినా.. ఆయనకు అవకాశాలు రాలేదు. మరోవైపు.. తనకంటే వెనక వచ్చిన వారికి ఛాన్సులు రావడం పట్ల కూడా ఆయన కుంగిపోయాడు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే.. శనివారం తెల్లవారుజామున టెర్రస్‌పై విగతజీవిగా కనిపించాడు.
RC16:రాంచరణ్, బుచ్చిబాబు సనా మూవీ పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్…
ఉదయాన్నే లేచిన స్నేహితుడు.. కీర్తి సాగర్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి, పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కీర్తి సాగర్ అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులు అతని గదిలోకి వెళ్లి చూడగా.. గది నిండా తాను రాసుకున్న వందలాది కథలు కనిపించాయి. అవి చూసిన పోలీసులు ఆశ్చర్యచకితులయ్యారు. కీర్తి సాగర్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు కానీ.. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. దీంతో.. ఉస్మానియా మార్చురీలో కీర్తి సాగర్ డెడ్ బాడీని భద్రపరిచారు.