వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాను వైసీపీ కార్యకర్తలే ఛీ కొడుతుంటే పారిపోయి తమ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి రోజా మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ఆరోపించారు. వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఫస్ట్రేషన్‌తో రోజా తమ మేడమ్‌పై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని.. రోజా నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. సూర్పణఖకు పట్టిన గతే రోజాకు టీడీపీ మహిళలు పట్టిస్తారని గుర్తుపెట్టుకోవాలని హితవు…
వైసీపీ నేతలకు పని లేక ఆడవారిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. నిజంగా భువనేశ్వరిని కించపరిచినట్లు మాట్లాడినవారు వాళ్ల పాపాన వాళ్లే పోతారని మంత్రి కొడాలి నాని అన్నారు. తాము విమర్శలు చేయకున్నా చేశామని చెప్పిన్నోళ్లు కూడా సంకనాకి పోతారని చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అసెంబ్లీలో రోజాను కంటతడి పెట్టించారని, లక్ష్మీపార్వతిని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకువెళ్లారని.. దానికి…
అనంతపురం జిల్లా టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన… వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. శనివారం ధర్మవరంలోని దుర్గానగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గౌరవసభ-ప్రజాసమస్యల చర్చావేదిక’ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. Read Also: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే..…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనసేన కార్యాలయానికి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం నాడు గుంటూరు జిల్లా కుంచనపల్లిలో పర్యటించిన నారా లోకేష్… అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ జనసేన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. కుంచన పల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ చర్చించినట్లు తెలుస్తోంది. Read Also: వెంకయ్య మనవరాలి రిసెప్షన్‌కు హాజరుకానున్న…
ఏపీలో జగన్ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్‌ను అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు ప్రయత్నించారని.. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఎమ్మెల్యే గోరంట్ల ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టుల అంశంలో కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం సంతోష్ భార్య నిండు గర్భవతి అని, ఆమె ఆసుపత్రిలో ఉందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో సంతోష్ ను…
టీడీపీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా నాయకురాలు భూమా అఖిలప్రియ గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. భూమా అఖిల ప్రియ తన తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. Read Also: ఏపీ పాలనా రాజధానిపై మంత్రి కీలక వ్యాఖ్యలు తల్లి శోభానాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంతిళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కుటుంబంతో కలిసి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి రాకముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో టిడ్కో ఇళ్లు అందరికీ పూర్తి ఉచితంగా ఇస్తానని…
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను పేరడీ చేశారు. ఈ సాంగ్‌ను వైసీపీ సర్కారు పాలనతో లింకు పెడుతూ.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు వేస్టు.. వేస్టు వేస్టు అంటూ ఎద్దేవా చేశారు. Read Also: కావాలంటే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ కళ్యాణ్ ‘అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు…
నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో నెల్లూరు నేతల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలను రద్దు చేశారు. అంతేకాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలు అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని టీడీపీ అధినేత సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు తమ పనితీరు మార్చుకోకుంటే భవిష్యత్‌లో కఠిన నిర్ణయాలు ఉంటాయని…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్‌కు ఊపిరి పోసిందని చిత్ర ప్రముఖులందరూ భావిస్తున్నారు. తాజాగా అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అఖండ మూవీని తాను ఇటీవల చూసినట్లు చంద్రబాబు ఈరోజు ప్రెస్మీట్లో వెల్లడించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన బాబు.. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని… సినిమా చాలా…