C.P. Radhakrishnan: విజయవాడ పున్నమి ఘాట్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. నగర ప్రజల మనసు హత్తుకునేలా ప్రసంగించారు. ప్రారంభంలో అందరికీ “తెలుగు భాషలో నమస్కారం” చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉపరాష్ట్రపతి, తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి. సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.
Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్ర రావు, శ్రీలీల అమెరికాలో నిర్వహించిన నాట్స్ ప్రోగ్రామ్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కు నన్ను పిలిచినందుకు మీ అందరికీ థాంక్స్. తెలుగు వారంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్. అదే ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది. నాట్స్ గురించి ఓ మాట చెబుతా. నాట్స్…
Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు…
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను…
Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అంటే నక్షత్ర గమనం లేదా కాలం. ‘ఆది’ అంటే మొదలు. అంటే ఒక కొత్త…
తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు.