బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ సరయుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సరయు అందులో బోల్డ్ వర్డ్స్, బోల్డ్ కంటెంట్ తో బాగా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక గతేడాది చివర్లో సరయు స్నేహితురాలు రాజన్న సిరిసిల్ల లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది. ఆ రెస్టారెంట్ ప్రమోషన్ వీడియోలో సరయు తన అందచందాలతో ఆడిపాడింది. అయితే ఆ వీడియోలో గణపతి బప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లను అందరు తలకు కట్టుకొని కనిపించారు. దీంతో హిందూ సంఘాలు వీరిపై విరుచుకుపడ్డారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ రాజన్న సిరిసిల్లలోనే కేసు నమోదు చేశారు. అంతేకాకుండా రెస్టారెంట్ కిచాలామంది మద్యం సేవించి వస్తున్నారని, అక్కడికి వచ్చేవారి వ్యవహారం అంతా తేడాగా ఉందని కూడా ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఈ కేసును హైదరాబాద్ కి ట్రాన్సఫర్ చేయడంతో ఇక్కడ సరయు, 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ వ్యవహారంపై ఈ బోల్డ్ బ్యూటీ ఎలా స్పందిస్తారో చూడాలి..